»   » అన్నీ అనుభవిస్తాను.. వాటిని పట్టించుకొను.. శృతిహాసన్

అన్నీ అనుభవిస్తాను.. వాటిని పట్టించుకొను.. శృతిహాసన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

మనసులో ఉన్నది కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడే హీరోయిన్లలో శృతిహాసన్ ఒకరు. తనకు నచ్చిన విషయాన్ని స్పష్టంగా చెప్పడంలో ఎలాంటి మొహమాట పడదు. జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించడానికి ముందు వెనుక ఆలోచించదు. ఆమె నటించిన చిత్రాలు అంతగా సక్సెస్ కాకపోయినా పట్టించుకోను అని చెప్తున్నది. బాలీవుడ్‌లో ఇటీవల విడుదలైన బహెన్ హోగి తేరి చిత్రం, కాటమరాయుడు చిత్రాలు శృతికి నిరాశనే మిగిల్చాయి. ప్రతిభావంతురాలైన కథానాయికగా, సంగీత దర్శకురాలిగా, గాయనిగా.. తన ప్రతిభ చూపిస్తూన్న శృతి ఇటీవల మీడియాతో మాట్లాడుతూ..

అన్ని రుచులను ఆస్వాదించాలి

అన్ని రుచులను ఆస్వాదించాలి

జీవితంలో అన్ని రకాల రుచును ఆస్వాదించాలి. గెలుపు, ఓటములను సమానంగా ప్రేమించాలి. జీవితం గెలుపు, ఓటముల కలయిక. తీపిని ఇష్టపడినంతగా చేదునీ స్వీకరించలేకపోయినప్పటికీ వాటిని అలవాటు చేసుకోవాల్సిందే అని శ్రుతిహాసన్‌ చెప్పింది

ఆల్ రౌండర్ అనిపించుకోవాలని

ఆల్ రౌండర్ అనిపించుకోవాలని

ఆల్‌రౌండర్‌ అనిపించుకోవాలని అందరికీ ఉంటుంది. నా అభిరుచులకు తగినట్టుగా అన్నింటా బెస్ట్ అనిపించుకోవాలనుకొంటాను. ఒకేసారి చాలా పనులు చేయాలనుకొంటుంటా. అలాంటప్పుడు మనకు తెలియని కళలు బయటపడుతుంటాయి అని అన్నారు.

కొత్త విషయాలు తెలుస్తాయి.

కొత్త విషయాలు తెలుస్తాయి.

వ్యక్తిగతంగానూ అన్ని రకాల అనుభూతుల్ని ఆస్వాదించాలనుకొంటాను. అప్పుడే జీవితంలో కొత్త విషయాలు తెలుస్తాయి. ఓటమిని అంత సీరియస్‌గా తీసుకోవద్దు. ఎందుకంటే గెలుపు కంటే ఎక్కువగా పాఠాలను ఓటమి నేర్పుతుంది అని అన్నారు.

ఓటమి మంచిదే.. పాఠాలను ..

ఓటమి మంచిదే.. పాఠాలను ..

ఓటమి జీవితానికి మంచిది. ఎప్పుడూ టాప్‌లో ఉండాలని కోరుకోను. అట్టడుగున ఏముందో తెలుసుకోవాలి. ఈ జీవితానికి ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఓ చోట ఫుల్‌స్టాప్‌ పడుతుంది. ఆలోగా అన్నీ అనుభవించాలని జీవిత సారాంశాన్ని శృతి భోధిస్తున్నది.

English summary
Shruti Hassan shares her point of view about life. she said I want to taste everything in life. I never care wins and losses. I accept defeat very much. Because that teaches lesson to overcome things in life.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu