»   » ఎన్టీఆర్ తో మరోసారి అవకాశం వస్తే వదులుకోను

ఎన్టీఆర్ తో మరోసారి అవకాశం వస్తే వదులుకోను

Posted By:
Subscribe to Filmibeat Telugu

తారక్‌ తో మరో సినిమా చేయాలని ఉంది. అలాంటి అవకాశం వస్తే మాత్రం వదులుకోను అంటోంది కాజల్ అగర్వాల్. ఆమె తాజా చిత్రం బృందావనం గురించి మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించింది. అలాగే తన పాత్ర గురించి చెబుతూ..నేను ఇప్పటి వరకూ ఎన్ని పాత్రలు చేసినా...నా మనస్తత్వానికి దగ్గర ఉన్న పాత్ర మాత్రం భూమి పాత్రే. ఇంకా చెప్పాలంటే తండ్రి ఆప్యాయతకోసం పరితపించే పాత్ర భూమిది. ఇంట్లోవారందరినీ ప్రేమించే గుణం కూడా ఈ పాత్రలో ఉంది. అందుకే ఈ పాత్ర నా మనసును తాకింది అంది. అలాగే బృందావనంలో నా పాత్ర పేరు భూమి. పేరుకు తగ్గట్టే భూదేవి అంత ఓర్పు ఉన్న అమ్మాయి పాత్ర అది. ఇలాంటి మంచి పాత్ర ఇచ్చిన వంశీకి థ్యాంక్స్ అంటూ కళ్ళు తిప్పుతూ చెప్పుకొచ్చింది.

నిజజీవితంలో నా తత్వం కూడా దాదాపు అలాగే ఉంటుంది.అమ్మను, నాన్నను, తోడబుట్టినవారినీ ఇలా అందరినీ అమితంగా ప్రేమిస్తా. అందుకే భూమి పాత్ర చేస్తున్నప్పుడు ఆ పాత్రలో ఇన్వాల్వ్ అయిపోయి నటించా. నా కెరీర్‌ లోని దిబెస్ట్ క్యారెక్టర్స్ ‌లో భూమి ఒకటని సగర్వంగా చెప్పగలను. అసలు ఈ పేరు విన్న వారందరూ ఎంతో కొత్తగా ఉందని అభినందించారు. ఇలాంటి పేరు ఓ అమ్మాయికి ఉండటం అరుదు అని కూడా చాలామంది అన్నారు తెలుసా అంటూ మురిసిపోతోంది. ఇక కాజల్ ప్రస్తుతం ప్రభాస్ సరసన ఒక సినిమా, రామ్‌ చరణ్‌ తో మెరుపు, రవితేజతో వీర, నాగచైతన్యతో ఒక సినిమా చేస్తూ బిజీగా ఉంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu