twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా: మనోజ్ బాజ్‌పాయ్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ప్రేమకథ, హ్యాపీ, కొమురం పులి, వేదం చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం అయిన బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్. తనదైన రీతిలో సినిమాల్లోని పాత్రలను రక్తికట్టించే మనోజ్ బాజ్‌పాయ్ వేదం సినిమాలో అద్భుతమైన నటనను కనబర్చారు. 7వ క్లాసు చదివేప్పటి నుండే నటనపై ఆసక్తి పెంచుకున్న మనోజ్...... చిన్న తనంలో తనకు 'నేషనల్ డ్రామా స్కూల్‌' చేరే అవకాశం దక్కక పోవడంతో ఆత్మ హత్య చేసుకోవాలనుకున్నాడట.

    ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మనోజ్ భాజ్ పాయ్ మాట్లాడుతూ.... నేను 'నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా'కు సెలక్ట్ కానప్పుడు చాలా చాలా బాధ పడ్డాను. 7వ తరగతి నుండే నేను మంచి నటున్ని కావాలని కలలు కనే వాన్ని. కానీ డ్రామా స్కూల్‌లో అవకాశం దక్కక పోయే సరికి చాలా నిరాశ పడ్డాను. ఓ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనిపించింది. నా స్నేహితులు నేనేమైనా చేసుకుంటానేమోనని భయపడేవాళ్లు. ఎప్పుడూ నాతోనే ఉండేవాళ్లు. నన్ను ఒంటరిగా వదిలిపెట్టేవారు కాదు. కొన్ని రోజుల తర్వాత ఆ బాధ నుంచి బయటపడ్డాను. ఆ తర్వాత ఎప్పుడూ ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన రాలేదు అని చెప్పుకొచ్చారు.

    నాకు మొదటి అవకాశం ఇచ్చింది దర్శకుడు శేఖర్ కపూర్. ఆ చిత్రంలో నేను మాన్ సింగ్ పాత్రలో నటించాను. ఆయన మేలు నేనెప్పటికీ మరిచిపోలేను. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'సత్య' చిత్రంతో మంచి పేరు రావడంతో పలు అవార్డులు కూడా దక్కాయి. ఆ తర్వాత నుంచి అవకాలు పెరిగాయి అని చెప్పుకొచ్చారు మనోజ్ బాజ్‌పాయ్. ప్రస్తుతం మనోజ్ బాజ్‌పాయ్ 'ది విష్పెరర్స్', 'షూటౌట్ వాడాలా', 'సత్యా గ్రహ' చిత్రాల్లో నటిస్తున్నారు.

    English summary
    "The toughest was when I did not get selected for NSD. I had nursed that dream ever since I was in class seven. I was devastated. I have never come as close to committing suicide as I did then. My friends were scared and five of them used to sleep next to me and would never leave me alone" Manoj Bajpayee told to TOI.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X