»   » శ్రీహరి మరణం తో మత్తుకు బానిసయ్యాను, పిల్లలకోసమె బయటపడ్డా: శ్రీహరి భార్య శాంతి

శ్రీహరి మరణం తో మత్తుకు బానిసయ్యాను, పిల్లలకోసమె బయటపడ్డా: శ్రీహరి భార్య శాంతి

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు సినిమాల్లో ఒకప్పుడు, ఐటమ్‌ డాన్సర్‌గా తిరుగులేని ఇమేజ్‌ సొంతం చేసుకున్న 'డిస్కో' శాంతి, శ్రీహరితో పెళ్ళయ్యాక సినిమాలకు దూరమైన విషయం విదితమే.ఇంటి పెద్ద దిక్కు శ్రీహరి మరణించినప్పటి నుండి డిస్కో శాంతి మానసికంగా చాలా కృంగి పోయిందని, ఈ క్రమంలోనే ఆమె అనారోగ్యం పాలైనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. శ్రీహరి కుటుంబ పరిస్థితి ఇలా తయారు కావడంపై రియల్ స్టార్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

శ్రీహ‌రి ఆక‌స్మిక మ‌ర‌ణం వ‌ల్ల క‌లిగిన బాధ‌ను భ‌రించ‌లేక తాను మ‌త్తుకు బానిసైన‌ట్లు, త‌ర్వాత త‌న పిల్ల‌ల కోసం మ‌త్తు వాడ‌కం నుంచి బ‌య‌ట‌ప‌డిన‌ట్లు శ్రీహ‌రి భార్య డిస్కో శాంతి తెలియ‌జేశారు. శ్రీహరి చ‌నిపోయాక తిండి స‌రిగా తిన‌కుండా, నిద్ర స‌రిగా పోకుండా మ‌త్తులో మునిగిపోయిన‌ట్లు, అలా నెల‌లు, సంవత్స‌రాలు గ‌డిచిపోయిన‌ట్లు ఆమె పేర్కొన్నారు.

i was addicted to alcohol after srihari death: Disco shanthi

ఇటీవ‌ల ఓ వార్తాప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆమె ఈ విష‌యాలు వెల్ల‌డించారు. మ‌త్తు వాడ‌కంలో మునిగిపోయిన త‌న దుస్థితి చూడ‌లేక‌, త‌న కుమారుడు ఆసుప‌త్రికి తీసుకెళ్లాడ‌ని, అక్క‌డ డాక్ట‌ర్లు చెప్పిన మాట‌లు విని తాను మ‌త్తు వాడకాన్ని వ‌దిలేసిన‌ట్లు ఆమె వివ‌రించారు. తాను కూడా లేక‌పోతే త‌న పిల్ల‌లు ఏమైపోతారోన‌ని మ‌త్తు ప‌దార్థాల‌ను పూర్తిగా మానేసిన‌ట్లు డిస్కో శాంతి చెప్పారు.

ఒక్కసారిగా ఆయన మమ్మల్ని అనాథను చేసి వెళ్లిపోయాడు. భరించలేని ఆ బాధలో మత్తుకు బానిసను అయ్యా. తిండికి, నీళ్లకు దూరం అయ్యి.. మత్తులో బతికేశా. నెలలు, సంవత్సరాలు అలా గడిచాయి.. ఆరోగ్యం చెడిపోయింది. ఆ సమయంలో పెద్ద కొడుకు చేతుల్తో ఎత్తుకు పోయి.. ఆసుపత్రిలో వేశాడు.. అప్పుడనిపించింది, నాకేమైనా అయితే పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? అని.. అందుకే ఆ మత్తు నుంచి పూర్తిగా బయటకు వచ్చేశా..' అని చెప్పారు శాంతి శ్రీహరి.

English summary
i was addicted to alcohol after srihari death, said Disco shanthi Sri Hari's Wife
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu