»   » ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా.. మాటల్లో చెప్పలేను.. పచ్చ బొట్టేసిన గాయని ఆవేదన

ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా.. మాటల్లో చెప్పలేను.. పచ్చ బొట్టేసిన గాయని ఆవేదన

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలి1 చిత్రంలో పచ్చ బొట్టేసినా పాట అద్భుతమైన ప్రేక్షకాదరణను సొంతం చేసుకొన్నది. ప్రభాస్, తమన్నాలపై చిత్రీకరించిన పాట తెరమీద అద్భుతంగా పండింది. కానీ తెర మీద కంటే గాయని పాడిన తీరు ఆ పాటకు రెండింతల శోభను తెచ్చిపెట్టింది. ఆ పాట పాడిన దామినికి ఎంతో క్రేజ్ తెచ్చిపెట్టింది. తాను ఓ రేంజ్‌కు చేరుకోవడానికి చాలా కష్టాలు పడ్డానని ఆమె ఇటీవల మీడియాకు వివరించింది. పాడుతా తీయగా కార్యక్రమంలో పాడిన తర్వాత నాపై నాకే నమ్మకం కలిగింది అని దామిని వెల్లడించింది. గాయనిగా ఆమె కెరీర్‌ గురించి, వ్యక్తిగత విషయాలను దామిని మీడియాతో పంచుకొన్నారు.

నీకు అవసరమా అన్నవాళ్లు ఉన్నారు..

నీకు అవసరమా అన్నవాళ్లు ఉన్నారు..

తొలినాళ్లలో గాయనిగా మారాలని ప్రయత్నిస్తున్నప్పుడు నీకు అవసరమా అని అన్నవాళ్లు ఉన్నారు. వారి మాటలు కొంత నిరుత్సాహం కలిగించినా.. పట్టుదలతో ప్రయత్నాలు సాధించాను. కొందరైతే ముఖం మీదే ఆ గొప్పగా పాడావు అని దెప్పి పొడిచారు అని దామిని గుర్తు చేసుకొన్నారు. ఆమె పాటలు పాడటం అంత ముఖ్యమా అని అన్నారు.

అక్కడే మలుపు తిరిగింది..

అక్కడే మలుపు తిరిగింది..

2014లో సూపర్ సింగర్స్ ఆడిషన్‌కు వెళ్లడం జీవితం మలుపుతిప్పింది. అక్కడే సంగీత దర్శకులు కీరవాణి, మణిశర్మ, అనూప్‌ పరిచయం అయ్యారు. నేను పాడిన పాటల సీడీలను వారికి అందజేశాను. ఓ రోజు కీరవాణి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. కీరవాణి టీమ్‌లో చేరుతావా అని అడిగితే వెంటనే మారో మాట మాట్లాడకుండా ఒప్పుకొన్నాను. ఆ తర్వాత దిక్కులు చూడకు రామయ్య అనే సినిమాకు ట్రాక్స్ పాడాను అని దామిని చెప్పారు.

రాజమౌళి ఓకే చేశారు..

రాజమౌళి ఓకే చేశారు..

కీరవాణి వద్ద నేను పాడిన తొలి పాట ‘బాహుబలి' సినిమాలో పచ్చబొట్టేసినా... ఆ అవకాశం ఊహించని విధంగా లభించింది. తొలుత తమిళంలో పాడించారు. దానిని ఓకే చేయించిన తర్వాత తెలుగులో పాడించే ప్రయత్నం చేశారు. తమిళంలో పాడిన పాటను ఇంగ్లీష్‌లో రాసుకొని వెంటనే పాడాను. కీరవాణి టేక్‌ తీసుకోగా, 45 నిమిషాల్లో తమిళ రికార్డింగ్‌ అయిపోయింది. తెలుగు వెర్షన్‌ పాడటానికి మాత్రం చాలా సమయం పట్టింది. ఆ పాట రాయడానికి రచయిత అనంత శ్రీరామ్‌కు 72 రోజులు పట్టిందని కీరవాణి చెప్పారు అని దామిని వె్లడించింది.

అవకాశం రాకపోతే..

అవకాశం రాకపోతే..

నేను పాడిన పాటను మరో సీనియర్‌ గాయనికి డిక్టేట్‌ చేస్తుంటే నా పాట నచ్చలేదని అనుకొన్నాను. ఒకవేళ అవకాశం దక్కకపోయినా బాహుబలి2లోనైనా అవకాశం సంపాదించాలనే పట్టుదల మొదలైంది. నాకింకా చాలా భవిష్యత్తు ఉంది. కీరవాణిగారి దగ్గరే ఇలాంటి అవకాశాలెన్నో అందుకుంటాననే నమ్మకంతో ధైర్యంగా ఉండేదానిని. కానీ రాజమౌళిగారు నా వాయిసే ఫైనల్‌ చేశారు.

అవమానాలను తట్టుకొన్నాను..

అవమానాలను తట్టుకొన్నాను..

గాయని కావాలనుకుని స్టూడియోల చుట్టూ తిరగడం మొదలుపెట్టినప్పుడు అవకాశాలు తేలిగ్గా రాలేదు. రకరకాల అవమానాలు ఎదురయ్యాయి. అయినా తట్టుకున్నాను. లక్ష్యాన్ని చేరడం అంత సులభం కాదని తొలినాళ్లలోనే తెలుసుకొన్నాను. నా దారి పూలదారి కాదు.. ముళ్లదారిని దాటాలని అనుకొన్నాను. అలాంటి అవమానాలను సహనంతో దాటాను. నా సహనానికి సాధన తోడు చేసుకున్నాను. ఇప్పుడు నాపై నాకు చాలా నమ్మకం ఏర్పడింది. జానకి, సుశీలమ్మ పాడిన కష్టమైన పాటల్ని సవాల్‌గా తీసుకొని సాధన చేసి పాడటమంటే చాలా ఇష్టం అని దామిని చెప్పారు.

English summary
Singer Damini become most popular after Pachcha bottesina song in Baahubali. She shares her experiences, troubles in initial days. she said I was overcome those obstacles with patience and talent.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X