»   » నా జాకెట్ ని కత్తితో చింపేసాడు కానీ...సంజన

నా జాకెట్ ని కత్తితో చింపేసాడు కానీ...సంజన

Posted By:
Subscribe to Filmibeat Telugu

వెబ్‌మీడియాలో నేను 'దుశ్శాసన" చిత్రంలో టాప్‌లెస్ దుస్తులతో నటించానని వార్తలు వస్తున్నాయి. కానీ ఆ వార్తల్లో నిజం లేదు అంటోంది సంజన. ఈ విషయంపై వివరణ ఇస్తూ...ఆ చిత్రంలో ఓ సీన్ లో విలన్ నా జాకెట్ ని కత్తితో చింపేస్తాడు కానీ, ఆ సన్నివేశంలో నేను న్యూడ్ గా లేను. లోపల స్కిన్ కలర్డ్ డ్రస్ వేసుకున్నాను అంది. కానీ బయిట చాలామంది నేను న్యూడ్ గా నటించానంటూ ప్రచారం చేస్తున్నారు..బాధగా ఉంది అంటోంది. 'బుజ్జిగాడు మేడిన్ చెన్నై" చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన సంజన ఆ తర్వాత తెలుగులో సత్యమేవ జయతే, అసమర్థుడు, పోలీస్ పోలీస్ చిత్రాల్లో నటించింది.కానీ అనుకున్న స్ధాయిలో క్లిక్ కాలేదు. తాజాగా ఆమె శ్రీకాంత్ సరసన 'దుశ్శాసన" చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో ఆమె టాప్ లెస్ గా నటించిందంటూ వార్తలు వినపిస్తున్నాయి. దాంతో ఈ విధమైన క్లారిఫికేషన్ ఇస్తోంది. ఇక దర్శకుడు పోసాని గురించి చెబుతూ..నిజానికి ఈ సినిమాలో నటించడం సంతోషంగా వుంది. పోసాని గారు ఎంతో ప్రతిభ గల దర్శకుడు. ఈ చిత్రం తప్పకుండా తెలుగులో నాకు మంచి పేరు తెచ్చిపెడుతుందనే నమ్మకం వుంది అంది. అలాగే ఈ చిత్రంలో కొన్ని గ్లామర్ సన్నివేశాల్లో నటించాల్సి వచ్చింది. అయినా కూడా కొన్ని షరతులకు లోబడే నటించాను. సన్నివేశానికి తగ్గట్టుగా గ్లామరస్‌గా కనిపించడంలో నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అంది.

English summary
Actress Sanjana who is playing the lead in Posani Krishna Murali and Srikanth’s movie ‘Dusshasana’ is all set to entangle in a neck deep controversy. She will be seen top less in a scene in Dusshasana.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu