»   » అర్జున్ వచ్చేవరకూ నటిస్తూనే ఉంటా: వెంకటేష్ (‘బాబు బంగారం’ఆడియో పంక్షన్ విశేషాలు,ఫొటోలు)

అర్జున్ వచ్చేవరకూ నటిస్తూనే ఉంటా: వెంకటేష్ (‘బాబు బంగారం’ఆడియో పంక్షన్ విశేషాలు,ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తరం మారినప్పుడల్లా పాత నీరు పోయి కొత్త నీరు వస్తూంటుంది. అలాగే సిని పరిశ్రమలోనూ జనరేషన్స్ మారినప్పుడల్లా వారసుల ఎంట్రీ జరుగుతూంటుంది. ఆ కోవలో చిరంజీవి కుమారుడు రామ్ చరణ్, నాగార్జున వారసులు అఖిల్, నాగచైతన్య వచ్చేసారు. బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ రెడీ అవుతున్నారు. ఇక ఇప్పుడు వెంకటేష్ కూడా తన కుమారుడు అర్జున్ ని దింపే పనిలో ఉన్నారు. అయితే అందుకు టైమ్ ఉంది. అప్పటివరకూ వెంకటేష్ నటిస్తూనే ఉంటారట. ఈ విషయాన్ని ఆయన స్వయంగా చెప్పారు.

వెంకటేష్ మాట్లాడుతూ...'' మరో పదేళ్లు, ఇరవయ్యేళ్లు లేదా మా అబ్బాయి అర్జున్ వచ్చేవరకూ సినిమాలు చేస్తుంటా'' అని వెంకటేశ్ అన్నారు. ఈ 30 ఏళ్లు ఎలా గడిచాయో తెలియడం లేదు. ఐదేళ్ల నుంచి సినిమాలు తగ్గిద్దామనుకున్నా. ఈ ట్రైలర్ చూసిన తర్వాత 'మరో పదిహేనేళ్ల వరకూ ఎక్స్‌పైరీ డేట్స్ ఇచ్చావేంటయ్యా' అని మారుతిని అడిగా అని ఆనందంగా అన్నారు.

మారుతి దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన చిత్రం 'బాబు బంగారం'. నయనతార హీరోయిన్. ఎస్.రాధాకృష్ణ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, పీడీవీ ప్రసాద్ నిర్మించారు. జిబ్రాన్ స్వరపరిచిన ఈ చిత్రం పాటలను ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్బంగా వెంకటేష్ మాట్లాడుతూ ఇలా స్పందించారు.

స్లైడ్ షోలో ఆడియో పంక్షన్ హైలెట్స్, ఫంక్షన్ ఫొటోలు

దాసరి అతిధిగా..

దాసరి అతిధిగా..

ఈ కార్యక్రమానికి దాసరి ముఖ్య అతిథిగా హాజరై తొలి సీడీని ఆవిష్కరించారు. డి.సురేష్‌బాబు అందుకొన్నారు.

వెంకటేష్ కే సాధ్యం

వెంకటేష్ కే సాధ్యం

‘‘ఓ నిర్మాత తనయుడు హీరోగా ముఫ్ఫై ఏళ్ల ప్రయాణం పూర్తి చేసుకోవడం మామూలు విషయం కాదు. అది వెంకటేష్‌కే సాధ్యమైంది'' అన్నారు ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు.

దాసరి మాట్లాడుతూ....

దాసరి మాట్లాడుతూ....

వెంకటేష్‌ని ‘బాబు బంగారం' అని ఇవాళ అందరూ చెబుతున్నారు. ముఫ్పై ఏళ్ల క్రితం ఆ విషయం నేనే చెప్పా. ఏ ఒక్క నిర్మాతనీ ఇబ్బంది పెట్టకుండా మూడు దశాబ్దాల ప్రయాణం సాగించాడు వెంకటేష్‌. తెరపై వెంకటేష్‌ వేరు.. తెర వెనుక వేరు. ఆయన నిర్మాతల కథానాయకుడు. నిర్మాత కష్టసుఖాలు తెలిసిన నిజమైన హీరో అని చెప్పారు.

గుర్తు చేసుకుంటూ...

గుర్తు చేసుకుంటూ...

‘బ్రహ్మపుత్రుడు' చిత్రీకరణ కశ్మీర్‌లో జరుగుతోంటే సౌండ్‌ బాక్స్‌ భుజంపై మోసుకొంటూ కొండెక్కాడు. అంత క్రమశిక్షణ, వృత్తిపై శ్రద్ధ ఉన్న నటుడు. కథాబలం ఉన్న చిత్రాల్ని ఎంచుకొన్నాడు. అందుకే ఎక్కువ విజయాలు దక్కాయి అని దాసరి అన్నారు.

అందుకే టైటిల్

అందుకే టైటిల్

ఉత్తమ నటుడిగా ఎక్కువ నంది అవార్డులు పొందింది తనే. వెంకటేష్‌ బంగారం కాబట్టే ఆ టైటిల్‌ పెట్టుంటారు. మారుతి చిన్న సినిమాలతో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఈ సినిమాతో స్టార్‌ దర్శకుడిగా మారతాడన్న నమ్మకం ఉంది''అన్నారు దాసరి.

కె.రాఘవేంద్రరావు చెబుతూ ...

కె.రాఘవేంద్రరావు చెబుతూ ...

‘‘వి అంటే విక్టరీ.. అనే డైలాగ్‌ ‘కలియుగ పాండవులు'లో వెంకటేష్‌తో చెప్పించాం. దాన్ని వెంకటేష్‌ నిజం చేశాడు.‘బాబు బంగారం' అంతటి ఘన విజయాన్ని సాధించాలి''అన్నారు.

అది వేరు

అది వేరు

జనరల్‌గా హీరో కొడుకును ఇంటడ్య్రూస్ చేయడం వేరు, నిర్మాత కొడుకును ఇంటడ్య్రూస్ చేయడం వేరు. నెగటివ్ క్యారెక్టర్‌తో మొదలు పెట్టి దాన్ని పాజిటివ్‌గా చూపించి 'కలియుగ పాండవులు' తీశా అన్నారు రాఘవేంద్రరావు.

ఆగస్టు సెంటిమెంట్

ఆగస్టు సెంటిమెంట్

ఆగస్టు 14న విడుదలైన 'కలియుగ పాండవులు' ఇరవైఐదు వారాలు ఆడింది. ఇప్పుడు ఈ 'బాబు బంగారం' కూడా ఆగస్టులో విడుదలవుతోంది. ఈ సినిమా కూడా ఇరవై ఐదు వారాలు ఆడాలి, ఆడుతుంది'' అన్నారు రాఘవేంద్రరావు.

వెంకటేష్‌ మాట్లాడుతూ..

వెంకటేష్‌ మాట్లాడుతూ..

ముఫ్పై ఏళ్లు ఎలా గడిచిపోయాయో నాకే అర్థం కావడం లేదు. వేదికలపై పెద్దగా మాట్లాడడం రాదు. ఏం చేసినా తెరపైనే. కేవలం అభిమానుల ప్రేమ కోసం, వాళ్ల కళ్లలో ఆనందం కోసం ఇలాంటి వేడుకలకు వస్తుంటా అన్నారు.

ధాంక్యూ..

ధాంక్యూ..

తొలి సినిమా నుంచీ నన్ను ప్రోత్సహిస్తున్నవాళ్లందరికీ నా కృతజ్ఞతలు. సినిమాలు తగ్గించేద్దాం అనుకొంటున్న సమయంలో మారుతి నాతో ఈ సినిమా తీశాడు. తెరపై నన్ను నేను చూసుకొంటుంటే పదిహేనేళ్లు వెనక్కి వెళ్లిపోయాననిపించింది అన్నారు సంబరంగా వెంకటేష్.

ఏమని పిలుస్తారో మరి...

ఏమని పిలుస్తారో మరి...

ఈ సినిమా తరవాత నన్ను పెళ్లికాని ప్రసాద్‌ అని పిలుస్తారో.. ‘బాబు బంగారం' అని పిలుస్తారో చూడాలి అని చెప్పారు వెంకటేష్.

ప్రేక్షకుల చేతుల్లో

ప్రేక్షకుల చేతుల్లో

ఈ సినిమాని ‘బొబ్బిలి రాజా'ని చేస్తారో.. ‘చంటి'ని చేస్తారో, ‘సీతమ్మ వాకిట్లో..' చేస్తారో.. ప్రేక్షకుల చేతుల్లో ఉంది. మా అబ్బాయి అర్జున్‌ వచ్చే వరకూ నటిస్తూనే ఉంటా'' అన్నారు.

దిల్ రాజు మాట్లాడుతూ...

దిల్ రాజు మాట్లాడుతూ...

‘‘వెంకటేష్‌ ఇలానే మరో ఇరవై ఏళ్ల పాటు నటించి యాభై ఏళ్ల పండగ జరుపుకోవాలని'' దిల్‌రాజు ఆకాంక్షించారు.

హీరో నాని మాట్లాడుతూ...

హీరో నాని మాట్లాడుతూ...

‘‘దృశ్యం', ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలు చాలా బాగుంటాయి. కానీ నాలాంటి అభిమానులకు ‘క్షణక్షణం', ‘బొబ్బిలి రాజా' ఇంకా ఎక్కువ నచ్చుతాయి. మా కోసం ఇలాంటి సినిమాల్ని ఆయన ఇంకా చేయాలి''అన్నారు నాని.

సంగీత దర్శకుడు జిబ్రాన్‌ మాట్లాడుతూ....

సంగీత దర్శకుడు జిబ్రాన్‌ మాట్లాడుతూ....

‘‘తెలుగులో ఇది నా మూడో సినిమా. వెంకటేష్‌గారితో పనిచేయడం గర్వంగా ఉంది''అన్నారు.

మారుతి మాట్లాడుతూ...

మారుతి మాట్లాడుతూ...

‘‘చిన్నప్పటి నుంచీ వెంకటేష్‌గారి సినిమాలు చూస్తూ పెరిగా. ఆయనతో పనిచేయడం దర్శకులందరికీ ఓ కల. వెంకటేష్‌ అభిమానుల్ని దృష్టిలో ఉంచుకొనే ఈ సినిమా తీశా. నయనతార పాత్రకు ప్రాణం పోశారు. వచ్చే నెల 12న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం'' అని మారుతి చెప్పారు.

గ్రాండ్ గా

గ్రాండ్ గా

ఈ ఆడియో ఫంక్షన్ చాలా గ్రాండ్ గా జరిగింది. సినీ ప్రముఖలు రావటంతో పండుగ వాతావరణం నెలకొనింది

నానితో

నానితో

నానితో దాసరి గారు ఏదో చెప్తూంటే భరోసా ఇస్తున్నట్లు లేదూ...

మన కాంబినేషన్ లో

మన కాంబినేషన్ లో

దిల్ రాజు, నాని కాంబినేషన్ లో నేను లోకల్ అనే సినిమా ప్రారంభం అవుతున్న సంగతి తెలిసిందే.

యాంకర్

యాంకర్

యాంకర్ సుమతో యాక్టివ్ గా స్టేజీపై పార్టిసిపేట్ చేసిన హీరో నాని

మళ్లీ మనదెప్పుడు

మళ్లీ మనదెప్పుడు

వెంకేటేష్...దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కు మళ్లీ మన కాంబినేషన్ లో సినిమా చేద్దామని చెప్పుతున్నట్లు లేదూ

చెయ్యచ్చుగా

చెయ్యచ్చుగా

అప్పట్లో చిన్న సినిమాలు చేసేవారు. ఇప్పుడు మన కాంబినేషన్ లో ఓ సినిమా ప్రారంభించవచ్చు కదా సార్ అని నాని అడుగుతున్నట్లు ఉంది కదూ...

అన్నదమ్ములతో

అన్నదమ్ములతో

సురేష్ ప్రొడక్షన్ తో దాసరి నారాయణరావు కు చాలా అనుబంధం ఉంది. అందుకే..అన్నదమ్ములు ఇద్దరూ ఆయన్ని చాలా గౌరవంగా చూస్తూంటారు.

ఎప్పుడు సార్

ఎప్పుడు సార్

మన కాంబినేషన్ లో భలే భలే మొగాడివోయ్ పెద్ద హిట్ కదా..మళ్లీ మన కాంబినేషన్ సెట్ చేయండి సార్ అని లావణ్య...మారుతిని అడుగుతన్నట్లు ఉంది కదూ...

ఎవరెవరు...

ఎవరెవరు...

ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ తో పాటు లావణ్య త్రిపాఠి, రాధాకృష్ణ, ముప్పలనేని శివ, జె.బి, ఫృథ్వీ, రమణ, రామజోగయ్యశాస్త్రి, కాశర్ల శ్యామ్‌, శ్రీమణి, భాస్కరభట్ల రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

English summary
Venkatesh too has decided to act for the coming decade and a half, till, in the star’s words, his son Arjun arrives. He confesses that he had decided to slow down and eventually quit but director Maruthi and Babu Bangaram has again rejuvenated his spirits to act for the next decade or so.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu