»   »  వివాహ తేది ప్రకటించిన సల్మాన్, జోకా, నిజమా?

వివాహ తేది ప్రకటించిన సల్మాన్, జోకా, నిజమా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్ ఎట్టకేలకు ఓ ఇంటివాడు అవటానికే నిర్ణయం తీసుకున్నాడా. కొంతకాలంగా డేటింగ్‌ చేస్తున్న రొమేనియా మహిళతో ఆయన వివాహం జరగబోతోందా.. ఏమో సల్మాన్ మాత్రం తాను నవంబర్ 18న వివాహం చేసుకుంటానంటూ చెప్పాడు.

అయితే ఇక్కడే ట్విస్ట్ ఇచ్చాడు. అది ఏ సంవత్సరంలో అన్నది మాత్రంలో చెప్పలేదు. ముంబైలో భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ఆత్మకథ 'ఏస్ అగైనెస్ట్ ఆడ్స్' పుస్తకావిష్కరణ సందర్భంగా ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.

తన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ప్రధాన అతిథిగా వచ్చిన సల్మాన్ ఖాన్ ను స్వయంగా సానియానే 'మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు' అని ప్రశ్నించింది. ఈ ప్రశ్న ఎంతో కీలకమైనది కావడం వల్ల సమాధానం చెప్పాలని కోరింది.

Salman Khan

ఈ ఊహించని ప్రశ్నతో కాస్త ఇబ్బంది పడ్డ సల్మాన్ కొంత ఆలోచించుకొని.. నవంబర్ 18న అని చెప్పాడు. తన తండ్రి సలీం ఖాన్, తల్లి సల్మా నవంబర్ 18న పెళ్లి చేసుకున్నారు. కాబట్టి అదే తేదీన పెళ్లి చేసుకోవాలని తాను భావిస్తున్నట్టు చెప్పాడు.

అయితే, ఇలాంటి నవంబర్ లో 20-25 వచ్చిపోయాయని, నవంబర్ 18న పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నప్పటికీ, అది ఏ సంవత్సరంలోనో తెలియదని సల్మాన్ చెప్పాడు. మీరు పెళ్లి చేసుకోకపోవడంపై మహిళలెవరూ మిమ్మల్ని అడగటం లేదా? అని సానియా అడుగగా. . కొందరు అడుగుతున్నారు.. మీకు తెలియదు ఎంతో ఒత్తిడి చేస్తున్నారు? సల్మాన్ బదులిచ్చాడు. ఆ మహిళలు ఎవరు అని అడుగగా.. మా అమ్మ, చెల్లెళ్లు.. వారు నేను పెళ్లిచేసుకోవాలని భావిస్తున్నారంటూ తెలిపాడు. అదండీ మ్యాటర్.

ఇక సల్మాన్...గతంలో ఐశ్వర్యారాయ్‌, కత్రినా కైఫ్‌ , సంగీతా బిజిలానీ సహా పదిమందితో సల్మాన్ ప్రేమాయణం నడిపాడు. ఐతే, ఎవరినీ పెళ్లి పీటల వరకు తీసుకురాలేదు. పదకొండవ ప్రేయసి పంటూర్‌కు మాత్రం సల్లూ ఆ అవకాశం ఇస్తున్నాడా లేదా అన్నది ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ లాంటి ప్రశ్న.

English summary
Salman Khan wants to get married on November 18. But for all those girls who love him don’t be heartbroken just yet for Bollywood’s Bhai is not sure the November of which year he would tie the knot ultimately.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu