»   » చిరంజీవితో సినిమా చేస్తా: 150 సినిమా చేజారినా ఆశ వదలని పూరీ

చిరంజీవితో సినిమా చేస్తా: 150 సినిమా చేజారినా ఆశ వదలని పూరీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: మెగాస్టార్ చిరంజీవితో సినిమా తీయాలనే తన కోరికను నెరవేర్చుకుంటానని ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ అంటున్నారు. భవిష్యత్తులో చిరంజీవితో కచ్చితంగా సినిమా తీస్తానని అన్నాడు. చిరంజీవి 150వ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం పూరీ జగన్నాథ్ చేజారింది.

చిరంజీవి 150వ సినిమాకు పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నట్లు తొలుత వార్తలు వచ్చాయి. పూరీ జగన్నాథ్ గతంలో చిరంజీవి కోసం ఓ కథను సిద్ధం చేసుకున్నారు కూడా. అయితే, చిరంజీవికి సెకండాఫ్ నచ్చకపోవడంతో అది పూరీ జగన్నాథ్ చేజారినట్లు చెబుతున్నారు.

I will make film with Chiranjeevi: Puri

చివరకు తమిళ చిత్రం కత్తిని రీమేక్ చేయాలని నిర్ణయించారు. ఆ రీమేక్ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం వివి వినాయక్‌కు దక్కింది. చిరంజీవి సినిమాకు సంబంధించిన ఆ వార్తను గతంలోనే ఆయన కుమారుడు, హీరో రామ్ చరణ్ చెప్పేశాడు.

తమిళ చిత్రం కత్తి రీమేక్‌లో తన తండ్రి నటిస్తారని, వివి వినాయక్ దర్శకత్వం వహిస్తారని ఆయన చెప్పారు. ఈ విషయంపై పూరీ జగన్నాథ్ ఓ మీడియా సంస్థ ప్రతినిధితో మాట్లాడారు. ఆ అవకాశం చేజారడం దురదృష్టకరమని, అయితే చిరంజీవితో తప్పకుండా తాను ఓ సినిమా చేస్తానని అన్నారు.

English summary
Tollywood director Puri Jagannath said that he make a film with megastar Chiranjeevi.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu