»   » నా బొడ్డుపై కొబ్బరికాయ వేస్తే,వారి మొహం మీద విసిరేస్తా: రాఘవేంద్రుడికి మళ్ళీ అవమానం

నా బొడ్డుపై కొబ్బరికాయ వేస్తే,వారి మొహం మీద విసిరేస్తా: రాఘవేంద్రుడికి మళ్ళీ అవమానం

Posted By:
Subscribe to Filmibeat Telugu

కొద్ది రోజుల క్రితం దర్శకేద్రుడు రాఘవేంద్రరావు మీద అనుచిత వ్యాఖ్యలు చేసి విమర్శలు మూటగట్టుకుంది తాప్సీ... ఝుమ్మంది నాథం సినిమాలో ఒక పాటలో ఆమె బొడ్డుపై కొబ్బరి కాయ విసరడంపై ఆమె ఈ విధంగా స్పందించారు. ఆ సినిమాలో ఓ పాటలో నా బొడ్డు మీదకు కొబ్బరికాయలు విసిరారు. అదేం శృంగారమో అర్థం కాలేదు. బొడ్డు మీదకు పూలు, పండ్లు విసరడంలో రొమాన్స్‌ ఏముందో' అంటూ మాట్లాడింది.

ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు

ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు

దీనిపై అటు సోషల్ మీడియాలో ఇటు సిని పరిశ్రమలో చాలా మంది ఆమెపై విరుచుకుపడ్డారు. ఈ వ్యాఖ్యలు కాస్తా పరిధి దాటడంతో ఆమె స్పందించింది. ఈ విషయంలో నేను ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అయితే నా డైరెక్టర్‌ రాఘవేంద్రరావుగారికి మాత్రం చెప్పాలి.

Taapsee Pannu Selfie Video about K Raghavendra Rao issue
నవ్వుతూ ఎంజాయ్‌ చేశామని

నవ్వుతూ ఎంజాయ్‌ చేశామని

రాఘవేంద్రరావుగారు, వారి కుటుంబ సభ్యులు ఆ షో చూశారు. కుటుంబసభ్యులందరం కలిసి ఆ షో చూశామని, నవ్వుతూ ఎంజాయ్‌ చేశామని వారు నాకు చెప్పారు. రాఘవేంద్రరావు గారు కూడా నా వ్యాఖ్యల గురించి పట్టించుకోలేదు. ఇక్కడితో దాన్ని ఆపేస్తే మంచిద'ని చెప్పుకొచ్చింది. అయినా తెలుగు ప్రేక్షకులు మాత్రం ఆమెని క్షమించినట్టు కనిపించలేదు. ఆమె మీద ఇప్పటికీ గుర్రుగానే ఉన్నారు.

పేరు ప్రస్తావించలేదు గానీ

పేరు ప్రస్తావించలేదు గానీ

అయితే ఆవివాదాన్ని మర్చిపోకముందే మళ్ళీ ఇంకో హీరోయిన్ కూడా అదే తరహాలో మళ్ళీ రాఘవేంద్ర రావుని విమర్శించింది. పేరు ప్రస్తావించలేదు గానీ ఆ కొబ్బరి కాయను ఆ దర్శకుడి మొహమ్మీదకి విసిరేస్తానంటూ మరీ విచక్షణా రహితంగా స్పందించింది. ఇంతకీ ఆమె ఎవరూ అంటే... అమీ జాక్సన్.

కొబ్బరికాయ విసిరితే ఏమి చేస్తారు

కొబ్బరికాయ విసిరితే ఏమి చేస్తారు

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ‘మీపై అలా కొబ్బరికాయ విసిరితే ఏమి చేస్తారు' అనే ప్రశ్న అమీకి ఎదురైంది. దీనికి స్పందించిన అమీ.. ‘ అదృష్టవశాత్తూ ఇప్పటివరకు నేను మంచి వ్యక్తిత్వం ఉన్న దర్శకులతోనే పనిచేశాను. అలా కొబ్బరికాయలు విసరడం చాలా భయంకరంగా ఉంటుంది.

మొహం మీదకే విసిరేస్తాను

మొహం మీదకే విసిరేస్తాను

నాకైతే ఎప్పుడూ అలాంటి అనుభవాలు ఎదురుకాలేదు. ఒకవేళ ఎవరైనా దర్శకుడు నాపై కొబ్బరికాయ విసిరితే తిరిగా వారి మొహం మీదకే విసిరేస్తాను. అందుకే నాతో ఎవరూ అలా ప్రవర్తించలేదేమో.'ని సమాధానమిచ్చింది అమీజాక్సన్‌. అయితే ఇంకా ఆమె మాటలమీద ఏ స్పందనా రాలేదు.

English summary
Recently, Taapsee Pannu faced backlash when she said she saw nothing sexy about K Raghavendra Rao throwing a coconut on her midriff.and now the same thing repeated With Amy jackson
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu