»   » పెళ్లికి ముందే తల్లిని అవుతా.. తప్పేముంది.. శృతిహాసన్

పెళ్లికి ముందే తల్లిని అవుతా.. తప్పేముంది.. శృతిహాసన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

బోల్డుగా, కుండలు బద్దలు కొట్టినట్టు మాట్లాడటంలో తండ్రి కమల్ హాసన్‌కు మించిన కూతురు అని శృతిహాసన్ గురించి చెప్పుకొంటారు. మీడియాతో మాట్లాడిన పలు సందర్భాల్లో ఆమె తీరు స్పష్టమైంది కూడా. సమాజ కట్టుబాట్లను పట్టించుకోకుండా తనకు ఇష్టమైన రితీలో వ్యవహరించడానికి శృతిహాసన్ ఎవర్నీ పట్టించుకోదు. తాజాగా శృతిహాసన్ చేసిన వ్యాఖ్యలు మీడియా పతాక శీర్షికలను ఆకర్షించాయి. ఇటీవల శృతిహాసన్ మీడియాతో మాట్లాడుతూ.. పెళ్లికి ముందు పిల్లల్ని కనడానికి సందేహించను అని చేసిన వ్యాఖ్యలపై ఇండస్ట్రీలో గుసగుసలు మొదలయ్యాయి. ఆమె పెళ్లికి చేసుకోవడానికి సిద్ధపడుతుందనే మాటలు సినీ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి. శృతిహాసన్ ఏమన్నారంటే..

సమాజానికి, మీడియాకు భయపడను..

సమాజానికి, మీడియాకు భయపడను..

ప్రస్తుతం నేను పెళ్లి గురించి ఆలోచించడం లేదు. కానీ సరైన సమయంలో సరైన వ్యక్తి తారసపడితే పెళ్లి చేసుకొంటాను. అయితే పెళ్లికి ముందు పిల్లల్ని కనడానికి సంకోచించను. ఈ విషయంలో సమాజానికి, మీడియా గురించి భయపడను అని శృతి వెల్లడించింది.

కొత్తేమీ కాదు..

కొత్తేమీ కాదు..

ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేయడం శృతిహాసన్‌కు కొత్తేమీ కాదు. గతంలో కూడా ఆమె బోల్డ్‌గా మాట్లాడటం జరిగింది. మీడియాతో మాట్లాడేటప్పుడు మనసులో ఒకటి, బయటికి మరోకటి చెప్పడం ఆమె నైజం కాదు. తనకు నచ్చిన విధంగా ఉండటం, లైఫ్ లీడ్ చేయడం లాంటివి చేస్తుంటుంది. ఇటీవల లండన్‌కు చెందిన థియేటర్ ఆర్టిస్టుతో అఫైర్ కొనసాగిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

మైఖేల్‌తో అఫైర్..

మైఖేల్‌తో అఫైర్..

ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయమైన లండన్ నటుడు మైఖేల్ కోర్సలేతో అతి సన్నిహితగా ఉంటున్నట్టు వార్తలు వచ్చాయి. వాటికి బలం చేకూరుస్తూ మైఖేల్‌తో శృతి ముంబై విమానాశ్రయంలో మీడియా కంట పడింది. డైనోసార్ పైల్ అప్ అనే రాక్ బ్యాండ్‌ కోసం ఓ పాట పాడటానికి వెళ్లినపుడు మైఖేల్‌తో పరిచయం జరిగిందని, ఆ పరిచయం అఫైర్‌కు దారి తీసినట్టు సమాచారం. అంతేకాకుండా కాటమరాయుడు షూటింగ్ జరిగే సమయంలో వీరిద్దరూ ముస్సోరిలో విహార యాత్ర చేశారు కూడా.

కమల్‌ అసంతప్తి

కమల్‌ అసంతప్తి

మైఖేల్‌తో శృతి అఫైర్ కొనసాగించడం కమల్‌కు ఇష్టం లేదనే వార్తలు వచ్చాయి. మైఖేల్, శృతి వ్యవహారంపై కమల్ అసంతృప్తిని వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ విషయంలో శృతిని కమల్ మందలించినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ వ్యవహారంలో తనకు ఇష్టం వచ్చిన విధంగా ఉంటానని తండ్రికి శృతి స్పష్టం చేసినట్టు తెలుస్తున్నది.

రణ్‌బీర్‌తో చెట్టాపట్టాల్.

రణ్‌బీర్‌తో చెట్టాపట్టాల్.

బాలీవుడ్ అందాల తార కత్రినా కైఫ్‌ తో అఫైర్ బ్రేకప్ అయిన తర్వాత హీరో రణ్‌బీర్ కపూర్‌తో శృతిహాసన్ చనువుగా వ్యవహరిస్తున్నట్టు రూమర్లు గుప్పుమన్నాయి. ఓ వ్యాపార ప్రకటనకు సంబంధించిన షూటింగ్ సందర్భంగా వారిద్దరూ క్లోజ్ అయినట్టు వార్తలు వచ్చాయి. అయితే రణ్‌బీర్ కపూర్‌తో అఫైర్ వార్తలను ఆమె ఖండించింది. నేను ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నాను. ఇలాంటి వార్తలన్నీ అవాస్తవం అని శృతి స్పష్టం చేసింది.

సంఘమిత్ర కోసం..

సంఘమిత్ర కోసం..

తమిళంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నసంఘమిత్ర చిత్రంలో ప్రస్తుతం శృతిహాసన్ నటిస్తున్నది. ఈ చిత్రం కోసం శృతిహాసన్ ప్రత్యేకంగా కత్తిసాము, గుర్రపు స్వారీ నేర్చుకొంటున్నది. అంతేకాకుండా బాలీవుడ్లో బహెన్ హోగీ తేరి అనే చిత్రంలో రాజ్ కుమార్ రావు‌కు జంటగా నటిస్తున్నది.

కేన్స్‌లో హవా..

కేన్స్‌లో హవా..

సంఘమిత్ర చిత్ర ప్రమోషన్ కోసం ఇటీవల కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌కు హాజరైంది. చిత్ర దర్శకుడు సుందర్, మ్యూజిక్ డైరెక్టర్ రెహ్మాన్‌తో కలిసి కేన్స్‌లో ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా పలువురు హాలీవుడ్ ప్రముఖులతో భేటీ అయ్యింది. తన ప్రియుడు మైఖేల్‌తో కలిసి ప్రముఖ రచయిత నీల్ గేమన్‌తో సమావేశమైంది. గేమన్‌తో శృతి, మైఖేల్ దిగిన ఫోటోను కమల్ ట్వీట్ చేయడం జరిగింది.

పెళ్లి కోసం ప్రయత్నాలు..

పెళ్లి కోసం ప్రయత్నాలు..

ప్రస్తుతం శృతిహాసన్ పెళ్లి చేసుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. కెరీర్‌ మంచి పీక్‌లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవడం ఎందుకనే వాదన సినీ వర్గాల నుంచి వినిపిస్తున్నది. అయితే పెళ్లిపై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొంటాను అని శృతిహాసన్ వెల్లడించడం గమనార్హం.

English summary
Shruti Haasan indeed made a bold statement regarding 'marriage and children' during her recent interaction with the media when she was asked about her thoughts on getting married and raising children. She opened up and said, "Presently I am not thinking of marriage but I will marry when I feel it's right time. If I find my right choice, I won't hesitate to have children even before marriage. I am not worried about the media and other people."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu