»   »  అవకాశం వస్తే వదలను: పవన్ కళ్యాణ్ గురించి రాశి

అవకాశం వస్తే వదలను: పవన్ కళ్యాణ్ గురించి రాశి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘ఊహలు గుసగుసలాడే', ‘జోరు' చిత్రాలతో ఇటు గ్లామర్ పరంగా, అటు పెర్ఫార్మెన్స్ పరంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న భామ రాశి ఖన్నా. తాజాగా అమ్ముడు గోపీచంద్ చంద్ సరసన ‘జిల్'చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం ఈ నెల 27న విడుదలవుతోంది.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రాశి ఖన్నా అభిమానుల ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చింది. పెళ్లి గురించి ప్రశ్నించగా...ప్రస్తుతం అలాంటి ఆలోచన లేదు. ఇప్పటి వరకు ఎవరి గురించి ఆలోచించలేదు. మంచి మనసున్నోడు, నిజాయితీ పరుడు అయితే చాలు అని చెప్పుకొచ్చింది.

I would love to act with Pawan Kalyan

నాకంటూ ప్రత్యేకంగా డ్రీమ్స్ రోల్స్ చేయాలనే ఆలోచన ఏమీ లేదు. అన్ని రకాలు పాత్రాలు చేయాలి, అందరు యాక్టర్స్ తో నటించాలని అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ తో నటించాలని ఉందా? అనే ప్రశ్నకు స్పందిస్తూ...‘పవన్ కళ్యాణ్ తో నటించాలని ఎవరు మాత్రం కోరుకోరు? అతనితో కలిసి పని చేయడం అంటే నాకు చాలా ఇష్టం. అలాంటి అవకాశం వస్తే మాత్రం వదలను' అని సమాధానం ఇచ్చింది.

ఇప్పటి వరకు నేను నటించని కోస్టార్లలో నాగ శౌర్య నా ఫేవరెట్ కోస్టార్. గోపీచంద్ గారు అమేజింగ్ యాక్టర్, అమేజింగ్ పర్సన్...‘జిల్' షూటింగ్ సమయంలో పెర్ఫార్మెన్స్ పరంగా నాకు ఎంతో హెల్ప్ చేసాడు అని రాశి ఖన్నాచెప్పుకొచ్చింది.

English summary
Rashi Khanna says, Who will not want to act with Pawan Kalyan? I would love to act with him if I get an opportunity.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu