»   » ‘ఐస్ క్రీమ్’ రుచిగా లేకున్నా... తేజస్వి అందాలకు డిమాండ్!

‘ఐస్ క్రీమ్’ రుచిగా లేకున్నా... తేజస్వి అందాలకు డిమాండ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'ఐస్ క్రీమ్' చిత్రం ఇటీవల విడుదలైన నెగెటివ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే వర్మ మాత్రం సినిమాకు పెట్టిన దానికంటే ఎక్కువే వచ్చింది. నిర్మాతలకు లాభాలు వచ్చాయని అంటున్నారు. ఈ చిత్రంలో నవదీప్, తేజస్వి నటించారు.

సినిమాలో అన్నింటికీ మైనస్ మార్కులే పడ్డప్పటికీ....హీరోయిన్ తేజస్వి పెర్ఫార్మెన్స్‌కు మాత్రం ప్లస్ మార్కులే పడ్డాయి. తొలి సినిమా అయినప్పటికీ అమ్మడు గ్లామర్ పరంగా, అందాల ఆరబోత పరంగా అదరగొట్టింది. దీంతో పలువురు టాలీవుడ్ దర్శక నిర్మాతల దృష్టి తేజస్విపై పడింది. ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి.

Ice Cream beauty flooded with offers

మీడియాతో తేజస్వి మాట్లాడుతూ...'ఐస్ క్రీమ్ చిత్రంలో నా పెర్ఫార్మెన్స్‌ను అందరూ మెచ్చుకుంటున్నారు. అవకాశాలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం రామ్ - రాకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న 'పండగ చేస్కో' చిత్రంలో ముఖ్యమైన పాత్ర చేస్తున్నాను' అని తెలిపారు. దీంతో పాటు మంచు విష్ణు సినిమాలో కూడా తేజస్వి నటిస్తోంది.

తేజస్వి ఇటీవలే ఓ తమిళ సినిమాలో హీరోయిన్‌గా అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది. శర్వానంద్, నీత్యామీనన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలోనూ ఓ ముఖ్య పాత్ర చేస్తోంది. టీవీ యాంకర్ ఓంకార్ తన తమ్ముడితో తీస్తున్న సినిమాలో హీరోయిన్‌గా ఆమెనే తీసుకోవాలని చూస్తున్నాడట.

English summary

 Ice Cream beauty Tejaswi flooded with multiple movie offers.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu