For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘ఇద్దరమ్మాయిలతో’ ఆడియో విశేషాలు(ఫోటోలతో)

  By Bojja Kumar
  |

  హైదరాబాద్ : అల్లు అర్జున్, అమలపాల్, కేథరీన్ హీరో హీరోయిన్లుగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ నిర్మిస్తున్న 'ఇద్దరమ్మాయిలతో' మూవీ ఆడియో విడుదల కార్యక్రమం ఆదివాకం శిల్పకళా వేదికలో ఘనంగా జరిగింది. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

  ఆడియో వేడుక కార్యక్రమానికి రామ్ చరణ్, వివి వినాయక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దేవిశ్రీ ప్రసాద్ స్టేజ్ షో అభిమానులను ఆకట్టుకుంది. డాన్సర్లతో స్పెప్పులు వేస్తూ....దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన లైవ్ షో ఈ కార్యక్రమానికి హైలెట్ గా మారింది.

  ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.....'హీరో తెరపై ప్రేక్షకులను నచ్చే విధంగా కనిపించడానికి తెర వెనక కనీసం 3 వందల మంది 100 రోజుల పాటు శ్రమిస్తారు. వారు చేసిన కష్టం వల్లనే హీరోగా పేరొస్తుంది. హీరోగా పుట్టడం మా అదృష్టం. మా కోసం కష్ట పడుతున్న వాళ్లకి పాదాభివందనం. నేను చేసిన సినిమాల్లో ఎక్కువ శాతం సినిమాలకు దేవిశ్రీ ప్రసాదే సంగీతం అందించారు. ఈ చిత్రానికి కూడా సూపర్ మ్యూజిక్ ఇచ్చారు. పూరి జగన్నాథ్ గారు ఈ సినిమా కోసం పడ్డశ్రమ మాటల్లో చెప్పలేను' అన్నారు.

  మరిన్ని వివరాలు స్లైడ్ షోలో...

  రామ్ చరణ్ మాట్లాడుతూ...‘క్రేజీ అనే పదానికి పూరి, బన్నీ నిర్వచనం. ఇప్పుడు వీరిద్దరితో పాటు దేవిశ్రీ అనే మూడో క్రేజీ చేరిపోయింది. ఈ కాంబినేషన్ బ్లాక్ బస్టర్ గా నిలవాలని కోరుకుంటున్నాను' అన్నారు.

  పూరి జగన్నాథ్ మాట్లాడుతూ దేవిశ్రీ ఈ సినిమాకి టాప్ లేచిపోయే పాటలిచ్చాడు. బన్నీ డాన్సులు, ఫైట్లు, యాక్టింగ్ బాగా చేస్తాడని మాత్రమే తెలసు...ఈ సినిమాలో తనలోని మరిన్ని క్వాలిటీలు చూస్తారు' అన్నారు.

  దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ...మంచి సాహిత్యాన్ని అందించిన వారికి థాంక్స్. వయోలిన్ ను బేస్ చేసుకుని ఓ పాట చేసాను. ఆ బిట్ కు మంచి పాపులారిటీ వచ్చింది. నా మ్యూజిక్ తగిన విధంగా బన్నీ అదరగొట్టాడు. పూరి సినిమాను ఇరగదీసాడు అన్నారు.

  దిల్ రాజు మాట్లాడుతూ...పూరి, దేవిశ్రీ కాంబినేషన్లో వస్తున్న తొలి సినిమా ఇది. నిర్మాతకు ఆల్ టైం రికార్డ్ అవుతుంది. హాట్రిక్ సినిమాగా ఆయనకు నమోదు కావాలి అన్నారు.

  బండ్ల గణేష్ మాట్లాడుతూ...బన్నీ నిర్మాతల పాలిట బంగారు బాతు. నేను బంగారు బాతు గుడ్డు మాత్రమే దాచుకుంటాను. కోయాలని చూస్తే ఎగిరి పోతుందని తెలుసు. ప్రతి రెండేళ్లకోసారి బన్నీ నాతో సినిమా చేస్తానని చెప్పారు. ఆయన మాటమీద నిలబడతాడని తెలుసు. ఈ సినిమా ఆయన కెరీర్లో నెం.1 సినిమా అవుతుంది. ఈ సినిమాకు పని చేసిన అందరికీ థాంక్స్ అన్నారు.

  అమల పాల్ మాట్లాడుతూ ఈ సినిమా షూటింగును నా జీవితంలోనే మరిచిపోలేను. లైఫ్ లో వండర్ ఫుల్ ఎక్స్‌పీరియన్స్, సినిమా అద్భుతంగా ఉంటుంది అన్నారు.

  ఇద్దరమ్మాయిలతో ఆడియో వేడుక దృశ్య మాలిక

  ఇద్దరమ్మాయిలతో ఆడియో వేడుక దృశ్య మాలిక

  ఇద్దరమ్మాయిలతో ఆడియో వేడుక దృశ్య మాలిక

  English summary
  Iddarammayilatho Movie Audio Launch Function held at Hyderabad. Allu Arjun, Ram Charan Teja, Catherine Tresa, Amala Paul, Charmi, Puri Jagannath, Bandla Ganesh, Devi Sri Prasad, Brahmanandam, Reshma, Allu Aravind, VV Vinayak and Others graced the event.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X