For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'ఇద్దరమ్మాయిలతో' హీరో,డైరక్టర్ కలిసి...( లీకెడ్ ఫోటోలు)

  By Srikanya
  |

  తిరుపతి : అల్లు అర్జున్‌ నటించిన 'ఇద్దరమ్మాయిలతో' చిత్రం వచ్చే నెల 23న విడుదల చేయనున్నట్లు సినీ నిర్మాత బండ్ల గణేష్‌ వెల్లడించారు. తిరుమల శ్రీవారిని చిత్రం ఆడియో సీడీలతో నిర్మాణ ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లపై దర్శించుకున్నారు. ఈ సందర్భంగా బండ్ల గణేష్‌ మాట్లాడారు.

  బండ్ల గణేష్ మాట్లాడుతూ ఇద్దరమ్మాయిలతో చిత్రం ఆడియో సీడీలను హైదరాబాదులో ఆదివారం విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అంతర్జాలంలో ప్రవేశపెట్టిన చిత్రం ట్రయలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిందని, 15 లక్షల మంది వీక్షించారని ఆనందం వ్యక్తం చేశారు.

  చిత్రం అల్లు అర్జున్‌కు ఘన విజయం సాధించి పెడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది వరకు చిత్రాల ఆడియో, వీడియో విడుదల సందర్భంగా శ్రీవారి ఆశీస్సులు అందుకున్నట్లు వివరించారు. శ్రీవారి తీర్థ ప్రసాదాలను నిర్మాతకు తితిదే అధికారులు అందచేసి సత్కరించారు.

  ఇక చిత్రం ...వర్కింగ్ స్టిల్స్ స్లైడ్ షో లో మీకోసం...

  ఈ చిత్రం పాటలను శిల్పకళావేదికలో పాటల్ని విడుదల చేస్తున్నారు.

  ప్రస్తుతం అన్నపూర్ణ సెవన్ ఏకర్స్‌లో వేసిన భారీ సెట్‌లో పాటను చిత్రీకరిస్తున్నారు.

  ప్రస్తుతం షూట్ చేస్తున్న పాట 'టాప్ లేచిపోద్ది' అనే పల్లవితో పాట మొదలవుతుంది.

  షూటింగ్ తో పాటు మరో వైపు ఎడిటింగ్, డబ్బింగ్ కూడా జరుగుతోంది.

  ప్రపంచవ్యాప్తంగా మే 24న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

  పూరి, బన్ని కెరీర్లలో బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలుస్తుందని నిర్మాత చెప్తున్నారు.

  టీజర్‌కి, థియేటర్ ట్రైలర్స్‌కి మంచి స్పందన వస్తోంది.

  దేవిశ్రీ మంచి సంగీతాన్నిచ్చారు. మ్యూజికల్ బొనాంజాగా మిగలనుంది అని దర్శకుడు తెలిపారు.

  అమలాపాల్, కేథరిన్ హీరోయిన్స్ కావటం క్రేజ్ తెచ్చిపెడుతుంది.

  బన్నీ ఈ సినిమాలో ఆయన విదేశాల్లో స్థిరపడ్డ రాక్‌స్టార్‌గా నటిస్తున్నారు.

  మామూలుగానే బన్నీ అన్నా, బన్నీ నృత్యాలన్నా అమ్మాయిల్లో యమా క్రేజ్. ఇక రాక్‌స్టార్‌గా ఇందులో బన్నీ చేసే నృత్యాలు వాళ్లను ఏ స్థాయిలో అలరిస్తాయో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.

  ‘మాటల్లేవ్...' అంటూ బన్నీ విలన్లను మట్టి కరిపించే టీజర్ ఇప్పటికే మీడియాలో హల్‌చల్ చేస్తోంది. సినిమాపై అంచనాలు పెంచేసే విధంగా ఈ టీజర్ ఉందని పలువురి అభిప్రాయం.

  బన్నీలోని కొత్త యాంగిల్ ఈ సినిమాలో చూస్తారు.

  పూరీ కెరీర్‌లో కూడా ఇదొక డిఫరెంట్ మూవీ అని చెప్పొచ్చు. అసలు ఈ సినిమా నేపథ్యమే కొత్తగా ఉంటుంది.

  అల్లు అర్జున్, దేవిశ్రీప్రసాద్ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన మ్యూజికల్ హిట్స్‌కి ధీటుగా ఈ ఆల్బమ్ ఉంటుంది.

  ఈ చిత్రంలో బ్రహ్మానందం, నాజర్, అలీ, షావర్, సుబ్బరాజు, శ్రీనివాసరెడ్డి తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: అమోల్ రాథోడ్, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, ఆర్ట్: బ్రహ్మ కడలి, సమర్పణ: శివబాబు బండ్ల.

  పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ..అల్లరి... ఆలోచన - ఆ అబ్బాయి ప్రత్యేకతలు. దుమ్ము రేపే జోరుంది. నిజం మాట్లాడతాడు. నిక్కచ్చిగా ఉంటాడు. అతని ఫిలాసఫీ కూడా కొత్తగా ఉంటుంది. 'చుట్టూ ఎవరూ లేనప్పుడు నువ్వేంటో.. అదే నువ్వు..' అంటూ హితోపదేశం చేస్తాడు. అతను ఇద్దరమ్మాయిలతో సాగించిన ప్రయాణం ఎలాంటిదో మా సినిమా చూసి తెలుసుకోవల్సిందే అంటున్నారు పూరి జగన్నాథ్‌

  ''చాలా కాలం తరవాత పూరి ఓ ప్రేమకథ తెరకెక్కిస్తున్నారు. ఆ ప్రేమాయణాన్ని చూపించే విధానం అందర్నీ అలరిస్తుంది. అల్లు అర్జున్‌ నటన, ఆయన కాస్ట్యూమ్స్‌ కొత్తగా ఉంటాయి. ఇటీవల విడుదలైన టీజర్‌కి మంచి స్పందన వచ్చింది. నెట్‌లో లక్షల మంది చూశారు. దేవిశ్రీ ప్రసాద్‌ అందించిన బాణీలు యువతరాన్ని ఆకట్టుకొంటాయి''అన్నారు.

  లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంపై బన్ని అభిమానుల్లోనే కాక మిగతా వారిలో కూడా మంచి అంచనాలు ఉన్నాయి.

  చిత్రానికి ఛాయాగ్రహణం: శ్యామ్‌.కె.నాయుడు, నృత్యాలు: దినేష్‌, కళ: చిన్నా, కూర్పు: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌. కో-రైటర్స్: బి.వి.ఎస్. రవి, కళ్యాణ్‌ వర్మ, నిర్మాత: బండ్ల గణేష్, దర్శకత్వం: పూరి జగన్నాథ్.

  English summary
  Allu Arjun’s ‘Iddarammayilatho’ is gearing up for its audio launch today. The film’s audio album has been composed by Devi Sri Prasad and the expectations on his work are pretty high. Devi Sri has been churning out very successful albums over the past couple of years and the first audio teaser of ‘Iddarammayilatho’ seems very promising. Allu Arjun and Devi Sri also share a very good rapport.
 The film has been directed by Puri Jagan and Bandla Ganesh is the producer. Catherine Tresa and Amala Paul are the heroines in this movie. Amol Rathod is the cinematographer and S.R.Sekkhar is the editor. ‘Iddarammayilatho’ is being readied for a release on May 24th.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X