»   »  డిజె లొల్లి: దమ్ముంటే ప్రూవ్ చేయ్, సినిమాలు మానేస్తా: హరీష్ శంకర్ సవాల్!

డిజె లొల్లి: దమ్ముంటే ప్రూవ్ చేయ్, సినిమాలు మానేస్తా: హరీష్ శంకర్ సవాల్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'డిజె' మూవీ పెద్ద ప్లాప్ సినిమా అని.... నిర్మాతలు చూపెడుతున్న కలెక్షన్లు అన్నీ ఫేక్ అంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో సోషల్ మీడియాలో చాలా ట్రోలింగ్ జరుగుతోంది. కొన్ని వెబ్ సైట్లు కూడా ఇలాంటి వార్తలే రాస్తున్నాయి.

బాక్సాఫీసు వద్ద 13 రోజులు పూర్తి చేసుకున్న 'డిజె' నైజాంలో రూ. 20 కోట్ల మార్కును అందుకుంది. ఈ నేపథ్యంలో హరీష్ శంకర్ చేసిన ట్వీట్లు చర్చనీయాంశం అయ్యాయి. ఎవరైనా ఈ వసూళ్ళ లెక్కలు తప్పు అని నిరూపిస్తే.... నేను సినిమాలు తీయడం మానేస్తాను, మరి మీరు మీ వెబ్ సైట్లు మూసుకుంటారా? అంటూ సవాల్ విసిరారు హరీష్.


తెలంగాణలో డిజె వసూళ్లు

నైజాం(తెలంగాణ) ప్రాంతంలో ‘డిజె' చిత్రం ఏ ఏరియాలో ఎంత వసూలు చేసింది, ఏ జిల్లాలో ఎంత రాబట్టింది అనే విషయాలు అఫీషియల్ గా విడుదల చేశారు. ఈ వివరాలను ట్వీట్ చేస్తూ ఈ వసూళ్ల లెక్కలు తప్పు అని నిరూపిస్తే.... నేను సినిమాలు తీయడం మానేస్తాను, మరి మీరు మీ వెబ్ సైట్లు మూసుకుంటారా? అంటూ సవాల్ విసిరారు హరీష్.గర్వంగా ఉంది.

నా కెరీర్లో నైజాంలో 20 కోట్లు వసూలు చేసిన రెండు సినిమాలు ఉండటం గర్వంగా ఫీలవుతున్నాను. అప్పుడు ‘గబ్బర్ సింగ్', ఇపుడు ‘డిజె' మూవీ ఈ ఘనత సాధించాయి అంటూ హరీష్ శంకర్ ట్వీట్ చేశారు.పగతో తప్పుడు ఆర్టికల్స్ రాసి అవమానించారు

విమర్శలు ఎంత వరస్ట్ గా ఉన్నా నేను స్వీకరిస్తాను. కానీ నా సినిమాకు పని చేసిన నటీనటులు, టెక్నీషియన్ల హార్డ్ వర్క్ శంకిస్తే మాత్రం సహించను. మాపై పగబట్టినట్లు ఫేక్ ఆర్టికల్స్ రాసి అవమానించారు అంటూ హరీష్ శంకర్ ఫైర్ అయ్యారు. పగతో తప్పుడు ఆర్టికల్స్ రాసి అవమానించారు.


యుద్ధం తప్పట్లేదు...

చివర్లో... ‘సారి గైస్ నేను సక్సెస్ ఎంజాయ్ చేసే మూడ్లోనే ఉన్నాను. ఇలాంటి ట్వీట్లు చేయాలని నాకు కూడా లేదు. కానీ తప్పట్లేదు... యుద్ధం శరణం గచ్చామి' అంటూ ట్వీట్ చేశాడు.


హరీష్ ట్వీట్లపై విమర్శలు

హరీష్ ట్వీట్లపై విమర్శలు

హరీష్ ట్వీట్లపై నెటిజన్ల నుండి ఎదురు దాడి మొదలైంది. నీ ఓవరాక్షన్ ఆపు అంటూ కొందరు కామెంట్స్ చేశారు.
English summary
"If any one proves DJ collections are wrong. I will stop making movies or else they should shut down their website" Harish Shankar tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu