»   » నాకు పెళ్లి కాకపోవడానికి కారణం ఆ హీరోనే.... హీరోయిన్ టబు సంచలనం!

నాకు పెళ్లి కాకపోవడానికి కారణం ఆ హీరోనే.... హీరోయిన్ టబు సంచలనం!

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ముంబై: హీరోయిన్ టబు పేరు చెప్పగానే తెలుగు వారికి ముందుగా గుర్తొచ్చేది 'నిన్నే పెళ్లాడతా' సినిమా. ఆ సినిమా తర్వాత నాగార్జున, టబు హాట్ ఫేవరెట్ జోడీ అయిపోయారు. అప్పట్లో వీరి మధ్య ఎఫైర్ ఉన్నట్లు కూడా వార్తొలొచ్చాయి.

  45 ఏళ్ల వయసొచ్చినా ఇప్పటికీ పెళ్లి దూరంగా ఉన్న ఈ ప్రౌడ సుందరి తాజాగా ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు పెళ్లి కాక పోవడానికి కారణం ఎవరో బయట పెట్టేసింది.

  అతడి వల్లే నాకు పెళ్లి కాలేదు

  అతడి వల్లే నాకు పెళ్లి కాలేదు

  తనకు పెళ్లి కాక పోవడానికి, ఇప్పటికీ సింగిల్‌గా మిగిలిపోవడానికి కారణం బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ అని టబు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. టబు ఈ విషయం చెప్పగానే అందరూ షాకయ్యారు.

  నన్ను అనుసరించేవాడు

  నన్ను అనుసరించేవాడు

  దాదాపు 25 సంవత్సరాలుగా అజయ్ దేవగన్ తనకు తెలుసని, ఒకప్పుడు తన కజిన్ సమీర్ ఇంటిపక్కనే అజయ్ ఉండేవాడని, తామంతా అప్పుడు మంచి స్నేహితులుగా ఉండేవారమని, ఆ సమయంలో అజయ్ తనను ఓకంట కనిపెడుతూ అనుసరించేవాడని టబు తెలిపారు.

  నాతో వేరే అబ్బాయిలు మాట్లాడితే దాడి చేసేవాడు

  నాతో వేరే అబ్బాయిలు మాట్లాడితే దాడి చేసేవాడు

  ఆ సమయంలో తాను ఎక్కడికి వెళ్లినా అజయ్ ఫాలో అయ్యేవాడు, వేరే అబ్బాయిలు ఎవరైనా తన వైపు చూసినా, మాట్లాడినా ... వారిపై దాడి చేసి వార్నింగ్ ఇచ్చేవాడని టబు తెలిపారు.

  పెళ్లి కాక పోవడానికి కారణం ముమ్మాటికీ అతడే...

  పెళ్లి కాక పోవడానికి కారణం ముమ్మాటికీ అతడే...

  అప్పట్లో అజయ్ ప్రవర్తన ఇతర అబ్బాయిలు నాతో మాట్లాడటానికి, నన్ను ప్రేమించడానికి భయపడేవారు. నాకు పెళ్లి కాకపోవడానికి కారణం ముమ్మాటికీ అజయ్. నాకో అబ్బాయిని చూసి పెళ్లి చేయాల్సిన బాధ్యత అతడితే అని టబు జోక్ చేశారు.

  మాది స్పెషల్ రిలేషన్

  మాది స్పెషల్ రిలేషన్

  అజయ్ దేవగన్‌తో తనది చాలా స్పెషల్ రిలేషన్. నాకు ఎంతో గౌరవం ఇస్తాడు, చాలా బాగా ట్రీట్ చేస్తాడు. అందుకే అజయ్ అంటే నాకు ఇప్పటికీ ఇష్టమే.... అంటూ టబు వ్యాఖ్యానించింది.

  గోల్‌మాల్ ఎగేన్

  గోల్‌మాల్ ఎగేన్

  ప్రస్తుతం అజయ్ దేవగన్, టబు కలిసి ‘గోల్‌మాల్ ఎగేన్' అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో పరిణీతి చోప్రా కూడా నటిస్తోంది. రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది అక్టోబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

  English summary
  "Yes, Ajay and I have known each other for 25 years. He was my cousin Sameer Arya’s neighbour and close buddy, a part of my growing up years and that has laid the foundation of our relationship. When I was young, Sameer and Ajay would spy on me, follow me around and threaten to beat up any boys who are caught talking to me. They were the big bullies and if I am single today, it is because of Ajay. I hope he repents and regrets what he did." Tabu said in a interview.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more