»   » అఖిల్ అక్కినేని డాన్స్ రిహార్సల్ కేక.... (వీడియో)

అఖిల్ అక్కినేని డాన్స్ రిహార్సల్ కేక.... (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇటీవల హైదరాబాద్ లో జరిగిన ‘ఐఫా ఉత్సవం'లో అఖిల్ అక్కినేని డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇరగదీసారు. ఇందుకోసం రెండు మూడు రోజుల ముందు నుండే రిహార్సల్స్ చేసాడు అఖల్. తాజాగా ఐఫా ఉత్సవానికి సంబంధించిన అఖిల్ రిహార్సల్ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..

రిహార్సల్స్ లో ఇరగదీసిన అఖిల్....ఐఫా ఉత్సవం రెండో రోజు వేడుకలో లైవ్ ఫెర్ఫార్మెన్స్ అదరగొట్టాడు. ఐఫా ఉత్సవంలో హైలెట్ అయిన అంశాల్లో అఖిల్ డాన్స్ పెర్ఫార్మెన్స్ కూడా ఒకటి. అక్కినేని ఫ్యామిలీ నుండి అత్యుత్తమ డాన్సర్ అఖిల్ అని నిరూపించుకున్నాడు.

అఖిల్ అక్కినేని వివి వినాయక్ దర్శకత్వంలో ‘అఖిల్' అనే సినిమా ద్వారం తెరంగ్రేటం చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అఖిల్ లుక్ పరంగా, డాన్స్ పెర్ఫార్మెన్స్ పరంగా, యాక్షన్ సీన్ల పరంగా ఆకట్టుకున్నాడు. అయితే సినిమా కథ అఖిల్ వయసుకు సెట్టేయ్యే విధంగా లేక పోవడంతో బాక్సాఫీసు వద్ద ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకుంది.

అఖిల్ లో మంచి టాలెంట్ ఉంది.... అతని టాలెంటుకు తగిన కథ, దర్శకుడు దొరికితే త్వరలోనే టాలీవుడ్ స్టార్ హీరోల లిస్టులో అఖిల్ చేరడం ఖాయం అంటున్నారు ఇండస్ట్రీ విశ్లేషకులు.

English summary
Watch, behind the scenes of Akkineni Akhil dance rehearsals for IIFA Utsavam.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu