»   »  బాహుబలి,శ్రీమంతుడు...ఏది గెలుస్తుంది

బాహుబలి,శ్రీమంతుడు...ఏది గెలుస్తుంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: ఇటీవల ప్రారంభించిన 'ఐఫా ఉత్సవం-2015' పురస్కారాల కోసం ఉత్తమ చిత్రాల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. ఈ పురస్కారాలకు సంబంధించిన నామినేషన్లను ఐఫా పురస్కారాల కమిటీ ఇటీవల విడుదల చేసింది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి, కొరటాల శివ దర్శకత్వం వహించిన శ్రీమంతుడు చిత్రాలు ఉత్తమ చిత్రం విభాగంలో పోటీలో ముందువరసలో ఉన్నాయి.

ఈ విభాగంలో నానీ నటించిన రెండు చిత్రాలు కూడా పోటీలో నిలిచాయి. అంతే కాకుండా.. ప్రభాస్‌, మహేశ్‌ బాబు, అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌లతో పాటు నానీ కూడా ఉత్తమ నటుడు విభాగంలో బరిలో నిలిచారు. హైదరాబాద్‌లో డిసెంబర్‌లో నిర్వహించే 'ఐఫా ఉత్సవం-2015' పురస్కారాలు ఎవరిని వరించనున్నాయో త్వరలో తెలియనుంది. అభిమానుల ఓటింగ్‌ ఆధారంగా ఈ పురస్కారాలను అందించనున్నారు.


IIFA Utsavam Telugu nominations

వివిధ విభాగాల్లో నామినేషన్‌ పొందిన చిత్రాలు వాటి వివరాలు పరిశీలిస్తే..


తెలుగు విభాగంలో ఉత్తమ చిత్రం బరిలో ఉన్న సినిమాలు
* బాహుబలి
* శ్రీమంతుడు
* పాఠశాల
* భలే భలే మగాడివోయ్‌
* ఎవడే సుబ్రమణ్యం


ఉత్తమ నటుడు పురస్కారం బరిలో హీరోలు


* ప్రభాస్‌ (బాహుబలి)
* నాని (భలే భలే మగాడివోయ్‌)
* మహేశ్‌ బాబు (శ్రీమంతుడు)
* అల్లు అర్జున్‌ (సన్‌ఆఫ్‌ సత్యమూర్తి)
* ఎన్టీఆర్‌ (టెంపర్‌)ఉత్తమ నాయిక బరిలో ఉన్న తారలు


* మంచు లక్ష్మి (దొంగాట)
* తమన్నా (బాహుబలి)
* లావణ్యా త్రిపాఠి (భలే భలే మగాడివోయ్‌)
* నిత్యా మేనన్‌ (మళ్లీ మళ్లీ ఇది రానిరోజు)
* శ్రుతి హాసన్‌ (శ్రీమంతుడు)


ఉత్తమ దర్శకుడు పురస్కారం బరిలో


* రాజమౌళి (బాహుబలి)
* కొరటాల శివ (శ్రీమంతుడు)
* మహి వి రాఘవ్‌ (పాఠశాల)
* చందూ మొండేటి (కార్తికేయ)
* పూరీ జగన్నాథ్‌ (టెంపర్‌)
ఉత్తమ సహాయ నటుడు విభాగంలో నామినేషన్స్‌


* సత్యరాజ్‌ (బాహుబలి)
* జగపతి బాబు (శ్రీమంతుడు)
* పవన్‌ కల్యాణ్‌ (గోపాల గోపాల)
* నవీన్‌ చంద్ర (భమ్‌ భోలేనాథ్‌)
* పోసాని కృష్ణ మురళి (టెంపర్‌)


ఉత్తమ సహాయ నటి నామినేషన్స్‌


* రమ్య కృష్ణ (బాహుబలి)
* రితు వర్మ (ఎవడే సుబ్రమణ్యం)
* తులసి (శ్రీమంతుడు)
* అపూర్వ శ్రీనివాసన్‌ (జ్యోతి లక్ష్మి)
* ప్రాచీ థాకీర్‌ (పటాస్‌)
ఉత్తమ సంగీత దర్శకుడు


* ఎం.ఎం.కీరవాణి (బాహుబలి)
* రఘు కుంచె, సాయి కార్తీక్‌, సత్య మహావీర్‌ (దొంగాట)
* దేవి శ్రీ ప్రసాద్‌ (శ్రీమంతుడు)
* అనూప్‌ రూబెన్స్‌ (టెంపర్‌)
* అనూప్‌ రూబెన్స్‌ (గోపాల గోపాల)


కమల్‌హాసన్‌ మాట్లాడుతూ ‘‘సినిమా అనేది వ్యాపారం కాదు. అది ప్రజలిచ్చిన గౌరవం. సౌత్‌ సినిమాకు పూర్వం నుంచి జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. రామానాయుడులాంటి నిర్మాతలు భారతదేశంలోని 13 భాషల్లో సినిమాలు తీశారు. ఇప్పుడు ‘ఐఫా' నిర్వహస్తున్న కార్యక్రమంతో సౌత్‌ సినిమా మరింత పేరు గడించాలని కోరుకుంటున్నాను'' అని అన్నారు.


‘‘ఏడాదికి వెయ్యి సినిమాలు వస్తుంటే అందులో ఆరువందల సినిమాలు దక్షిణభారత చలనచిత్ర పరిశ్రమకు చెందినవే. ఇక్కడి కళాకారుల ప్రతిభను గుర్తించి తొలిసారి ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిలిం అకాడమీ ‘ఐఫా' దక్షిణభారత సినీ కళాకారులను పురస్కరించబోతుండడం ఆనందంగా ఉంది. ఇది మంచి ఆరంభం'' అని కమల్‌హాసన్‌ అన్నారు.

English summary
Baahubali takes the lead with 14 nominations followed by Srimanthudu with 11 nominations. Fortune Sunflower Oil IIFA Utsavam Awards co-powered by Gionee smartphone and Renault – Passion for Life today announced the nominations for their premiere edition.
Please Wait while comments are loading...