»   » హీరోయిన్ హన్సిక 25వ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫోటోస్)

హీరోయిన్ హన్సిక 25వ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫోటోస్)

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: ఆగస్టు 9 అంటే అందరికీ మహేష్ బాబు పుట్టినరోజే గుర్తొస్తుంది. ఈరోజు మహేష్ బాబుతో పాటు హీరోయిన్ హన్సిక పుట్టినరోజు కూడా. నేటితో ఆమె 25వ వసంతంలోకి అడుగు పెడుతోంది. ఈ సారి ఆమె బర్త్ డే సెలబ్రేషన్స్ ఫ్యామిలీ, ప్రెండ్స్ సమక్షంలో సింపుల్ గా జరుపుకుంది. అందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ అయ్యాయి.

  హన్సిక ప్రతిసారి తన పుట్టినరోజు సమయంలో ఏదో ఒక సినిమా సెట్లో ఉండేది. అక్కడే యూనిట్ సభ్యుల మధ్య కేక్ కట్ చేయడం లాంటివి చేసేది. అయితే ఈ సారి షూటింగ్ బిజీ అంతగా లేనట్లుగా ఉంది. అందుకే కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ మధ్య వేడుక జరుపుకుంది. ఈ వేడుకకు తెలుగు స్టార్ మంచు విష్ణు కూడా హాజరయ్యారు.

  హన్సిక పర్సనల్ లైవ్ గురించిన వివరాల్లోకి వెళితే... హన్సిక ముంబైలో జన్మించింది. తండ్రి పేరు ప్రదీప్ మొత్వాని, బిజినెస్ మేన్. తల్లి మోనా మొత్వానీ.. డెర్మటాలజిస్ట్. ఆమెకు ప్రశాంత్ మొత్వాని అనే సోదరుడు కూడా ఉన్నాడు. హన్సిక మాతృభాష సింధి, ఆమెతో పాటు కుటుంబ సభ్యులు బౌద్ధ మతాన్ని ఆచరిస్తున్నారు.

  దివ్య దర్శిని

  దివ్య దర్శిని

  హన్సిక ఫ్రెండ్ దివ్య దర్శిని ఈ ఫోటోను ట్విట్టర్లో పోస్టు చేసి హన్సికకు పుట్టినరోజు విషెస్ తెలియజేసింది.

  ఉదయ నిధి స్టాలిన్

  ఉదయ నిధి స్టాలిన్

  కరుణానిధి మనవడు ఉదయనిధి స్టాలిన్ నటించిన తొలి సినిమాలో హన్సికనే హీరోయిన్. అందుకే హన్సిక పుట్టినరోజు నాడు మరిచి పోకుండా విషెస్ తెలియజేసాడు స్టాలిన్.

  ఆర్య

  ఆర్య

  తమిళ సినీ పరిశ్రమలోని హన్సిక క్లోజ్ ఫ్రెండ్స్ లో ఆర్య ఒకరు. ఈ సంవత్సరం అంతా హన్సికకు బాగా జరుగాలని ఆకాంక్షిస్తూ విష్ చేసారు.

  విజె రమ్య

  విజె రమ్య

  తమిళ యాంకర్ రమ్య కూడా హన్సికకు చాలా క్లోజ్. ట్విట్టర్ ద్వారా హన్సికకు బెస్ట్ విషెస్ తెలియజేసింది.

  బర్త్ డే పిక్

  బర్త్ డే పిక్

  హీరోయిన్ హన్సిక పుట్టినరోజు వేడుకకు సంబంధించిన ఫోటోస్..

  హ్యాపీగా

  హ్యాపీగా

  ఈ సారి బర్త్ డే సందర్భంగా కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ తో గడపటంతో హన్సిక చాలా సంతోషంగా కనిపించింది. త్రిష కూడా హన్సికకు పుట్టినరోజు విషెస్ తెలియజేసింది.

  'షకలక భూమ్ భూమ్' అనే టీవీ సీరియల్ ద్వారా చిన్నతనంలోనే బాలనటిగా హన్సిక కెరీర్ ప్రారంభించింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బన్నీ హీరోగా వచ్చిన 'దేశ ముదురు' సినిమా ద్వారా హన్సిక హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో హన్సికకు అవకాశాలు వెల్లువెత్తాయి.

  ప్రస్తుతం హన్సిక ఎక్కువగా తమిళంలోనే నటిస్తోంది. ఆమె తెలుగులో చివరగా రవితేజ మూవీ పవర్‌లో నటించింది. ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోంది. ఈ రోజు 25వ పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్న హన్సికకు ఫిల్మీ బీట్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం. మెనీ హ్యాపీ రిటర్న్ ఆఫ్ ది డే హన్సిక.

  English summary
  Hansika Motwani, who turned 25 today (August 9), is celebrating her birthday in style amid family and friends. The actress was seen cutting her birthday cake, even as she was surrounded by balloons and other party related items. Pampered by her friends and kins, the birthday girl was visibly happy before submerging herself in the ocean of social media.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more