»   » పద్మవిభూషణ్ అందుకున్న ఇళయరాజా

పద్మవిభూషణ్ అందుకున్న ఇళయరాజా

Posted By:
Subscribe to Filmibeat Telugu

మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా మంగళవారం పద్మవిభూషణ్ అవార్డును అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ముగ్గురికి పద్మ విభూషణ్, 9 మందికి పద్మభూషణ్, 72 మందికి పద్మశ్రీ పురస్కరాలను ప్రకటించిన విషయం తెలిసిందే.

రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో పద్మ అవార్డు గ్రహీతలు పలువురికి రాష్ట్రపతి పురస్కారాలను అందజేశారు. ఈ రోజు జరిగిన కార్యక్రమంలో మొత్తం 41 మందికి పద్మ పురస్కారాల ప్రదానం జరిగింది. మిగిలిన వారికి ఏప్రిల్ 2న అవార్డులు ప్రదానం చేయనున్నారు.

ఇళయారాజకు అవార్డు ప్రధానం అనంతరం ప్రధాన మంత్రి కార్యాలయం నుండి ట్విట్టర్ ద్వారా ఒక ప్రకటన కూడా విడుదలైంది. సంగీత రంగానికి ఇళయారాజా అందించిన విశేషసేవలకుగాను ఆయనకు ఈ అవార్డు ప్రధానం చేసినట్లు పేర్కొన్నారు.

English summary
Music director Isaignani Ilaiyaraaja received Padma Vibhushan award on tuesday by the President of India.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X