For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  చెన్నైలో అనూష్క 'రుద్రమదేవి'

  By Srikanya
  |
  హైదరాబాద్ : అనుష్క ప్రధాన పాత్రలో నటించే చిత్రం 'రుద్రమదేవి'. కాకతీయుల చరిత్ర ఆధారంగా రూపుదిద్దుకొనే చిత్రమిది. స్టీరియో స్కోపిక్‌ త్రీడీ విధానంలో రూపొందబోతోంది. గుణశేఖర్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఇళయరాజా స్వరకర్త. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన సంగీత చర్చలు చెన్నైలో కొనసాగుతున్నాయి.

  దర్శకనిర్మాత మాట్లాడుతూ ''అంతర్జాతీయ స్థాయి సాంకేతిక పరిజ్ఞానంతో తెరకెక్కనున్న చిత్రమిది. ఈ కథ వినగానే ఇళయరాజా ఎంతో సంతోషించారు. ఇలాంటి చిత్రానికి సంగీతం కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండాలని ఆయన ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ పాటల్ని సిద్ధం చేస్తున్నారు. ఆరు బాణీల్ని సిద్ధం చేశారు. వాటిని లండన్‌లోని సింఫనీ ఆర్కెస్ట్రాతో రికార్డ్‌ చేయించాలని ఆయన నిర్ణయించారు. తెలుగులో ఇదొక ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిపోనుంది''అని తెలిపారు.

  ఈ సినిమా కోసం ఇప్పటికే అనుష్క కత్తియుద్ధాలు నేర్చుకొంటోంది. వచ్చే నెలలోనే షూటింగ్ మొదలవుతుంది. భారతదేశపు తొలి హిస్టారికల్ స్టీరియోస్కోపిక్ 3డి మూవీ ఇదే అవుతుంది. అంతర్జాతీయ స్థాయిలో ఈ చిత్రాన్ని 'గుణా టీమ్ వర్క్స్' పతాకంపై రూపొందిస్తున్నారు గుణశేఖర్. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా అయితేనే న్యాయం జరుగుతుందని ఆయన్ను సంగీతదర్శకునిగా తీసుకున్నారు. ఆర్ట్: తోట తరణి, కెమెరా: అజయ్ విన్సెంట్, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, విఎఫ్‌ఎక్స్ సూపర్‌వైజర్: కమల్ కణ్ణన్, కాస్ట్యూమ్ డిజైనర్: నీతా లుల్లా ('జోధా అక్బర్' ఫేం).

  ''కాకతీయుల చరిత్ర, 'రుద్రమ దేవి' కథ, పాత్రల గురించి దర్శకుడు గుణశేఖర్‌ చెబుతుంటే చాలా ఆసక్తిగా అనిపించింది. ఆయన స్క్రిప్ట్‌ మొత్తం చూపించారు. ఆ పాత్ర కోసం నేను నెలన్నర రోజులపాటు ప్రత్యేకంగా శిక్షణ తీసుకోబోతున్నాను'' అని అనూష్క మీడియాకు తెలియచేసారు. గుర్రం స్వారీ,కత్తి తిప్పటం, హుందాగా నడవటం, ప్రత్యేకమైన మాడ్యూలేషన్ వంటివి ఈ శిక్షణలో ఉండనున్నాయని సమాచారం.

  మరో ప్రక్క దర్శకుడు గుణశేఖర్ ఈ చిత్రం కోసం లొకేషన్స్ ఎంపిక,ఫోటో షూట్ వంటి పనుల్లో బిజీగా ఉన్నారు. అనూష్క,గుణశేఖర్ కాంబినేషన్ లో 'రుద్రమదేవి' అనే చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే.గుణశేఖర్‌ స్వీయ దర్శకత్వం వహిస్తున్న ఈ త్రీడీ చిత్రం వరంగల్ లో లొకేషన్స్ చూసుకు వచ్చింది. వరంగల్‌ పేరు చెప్పగానే వేయి స్తంభాల గుడితో పాటు రాణీ రుద్రమదేవి కూడా గుర్తొస్తుంది. 13వ శతాబ్దపు కాకతీయుల వైభవాన్ని చరిత్ర పాఠాల్లో కథలు కథలుగా చెప్పుకొన్నాం. రుద్రమదేవి సాహస గాథ విని స్ఫూర్తి తెచ్చుకొన్నాం. అవన్నీ మా సినిమాలో చూపిస్తున్నాం అంటున్నారు గుణశేఖర్.

  గుణశేఖర్‌ మాట్లాడుతూ ''వరంగల్‌లోని చారిత్రక కట్టడాల గురించి చరిత్రకారులతో ప్రత్యేకంగా మాట్లాడాను. అవన్నీ మా పరిశోధనకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. వారి సూచనలకు తగినట్టుగా సెట్స్‌ నిర్మిస్తున్నాం. కళాదర్శకుడు తోట తరణి.. ఇందుకు సంబంధించిన స్కెచ్‌లు వేస్తున్నారు''అని చెప్పారు. ఫిబ్రవరిలో షూటింగ్ ప్రారంభిస్తారు. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు.

  English summary
  
 Director Gunasekhar says music maestro Ilayaraja plans to record songs for upcoming Telugu period drama "Rudrama Devi" with the London Symphony orchestra. "Since it's a period film, Raja sir insisted that we record the songs with the London Symphony orchestra. He has already composed six songs for the album and we will start recording very soon with the orchestra in London," Gunasekhar, who is directing and producing the film, told Media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X