»   » ఎన్టీఆర్ 'శక్తి' లో నా పాత్ర...ఇలియానా

ఎన్టీఆర్ 'శక్తి' లో నా పాత్ర...ఇలియానా

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఎన్టీఆర్‌ సరసన 'శక్తి' చిత్రంలో చేస్తున్నానని, వినోద ప్రధానంగా సాగే ఈ చిత్రంలో మంచి పాత్ర చేస్తున్నానని చెప్తూ మురిసిపోతోంది ఇలియానా. అలాగే ఒక సినిమా ఒప్పుకున్న తర్వాత అందులో నా పాత్రకి పూర్తి న్యాయం చేయడానికి కృషి చేస్తాను. సినిమా హిట్‌ అయితే ఆనందపడతాను. ఫెయిల్ అయితే కాసేపు బాధపడతాను. అంతకుమించి నేను చేయగలిగింది ఏమీ లేదు. నటిగా నేనెప్పుడూ ఫెయిల్‌ కాలేదు అంటోంది ఈ గోవా సుందరి. ఈ మధ్య రెచ్చిపో, సలీం చిత్రాలు వరసగా ఫెయిల్యూర్ కావటంతో బాధను వ్యక్తం చేసింది.అలాగే విక్రమ్ సరసన కమిటయిన 24 అనే చిత్రం కూడా ఆగిపోవటం ఇబ్బందికరమైన విషయమేనంటోంది.

వరుసగా ఫ్లాప్‌లు చవిచూసినప్పుడు ఓ సక్సెస్‌ వరిస్తే బాగుంటుందని అనుకుంటాను. అందుకే ఎదురుచూస్తున్నాను. శక్తి ఆ అవకాశం ఇస్తుందని అనుకుంటున్నారు. ఏదైమైనా ప్రస్తుతం తెలుగులో నా ఖాతాలో ఓ బలమైన హిట్‌ పడాలని కోరుకుంటున్నాను' అంటోంది ఇలియానా. ఇక తాను రామ్‌ సరసన నటించనున్న 'టామ్‌ అండ్‌ జెరీ'లో కూడా మంచి క్యారెక్టర్‌ చేయనున్నట్లు ఇలియానా చెప్పారు. ఇంకో విషయం ఏంటంటే..టీవీలో వచ్చే కార్టూన్‌ షో 'టామ్‌ అండ్‌ జెరీ' అంటే తనకెంతో ఇష్టమని, ఇప్పుడా పేరుతో సినిమా చేయడం ఆనందంగా ఉందని కూడా ఆమె అన్నారు. ఆమె త్వరలో హిట్ కొట్టాలని ఆశిద్దాం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu