»   » ఇలియానా దుస్తులు వేలానికి

ఇలియానా దుస్తులు వేలానికి

Posted By:
Subscribe to Filmibeat Telugu
Ileana
హైదరాబాద్: సౌత్ సినిమాలకు పూర్తిగా దూరమైన హీరోయిన్ ఇలియానా ప్రస్తుతం బాలీవుడ్లోనే పాగా వేసిన సంగతి తెలిసిందే. మూగజీవాలంటే ఎంతో ఇష్టపడే ఇలియానా వాటికోసం ఏదైనా చేయాలనే ఆలోచనకు వచ్చింది. ఓ వెటర్నరీ ఆసుపత్రికి హెల్ప్ చేయడం కోసం సినిమాల్లో తను వేసుకున్న కాస్ట్యూమ్స్ వేలం వేయాలని నిర్ణయించుకుంది. తద్వారా వచ్చే డబ్బును జంతువుల క్షేమం కోసం వినియోగిస్తుందట. ఫిల్మ్ మేకర్ వర్షా తౌరానీ కూడా 'పతా పోస్టర్ నిక్లా హీరో' చిత్రంలో ఇలియానా కాస్టూమ్స్ వేలం వేయడానికి ముందుకు వచ్చారు.

ఆ విషయాలు పక్కన పెడితే...ఇలియానా ఇక తెలుగుతో పాటు సౌత్ సినిమాలకు పూర్తిగా దూరం కాబోతోంది. హైదరాబాద్‌ నుండి పూర్తికగా మకాం ఎత్తేయడానికి ప్లాన్ చేసుకుంటోందట. హైదరాబాద్‌లోని ల్యాంకో టవర్స్‌లో రూ. 1.25 కోట్లు పెట్టి అప్పట్లో కొనుగోలు చేసిన ఫ్లాట్‌ను ఇలియానా అమ్మకానికి పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీన్ని బట్టి అమ్మడు ఇక సౌత్ సినిమా వైపు చూడబోదని స్పష్టం అవుతోందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సౌత్‌లో కోటిగా పైగా రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్‌గా వరుస అవకాశాలు దక్కించుకున్న ఇలియానా......డబ్బు బాగానే పోగేసుకుంది.

తెలుగు మూవీ 'దేవదాసు' ద్వారా హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించిన ఇలియానా తొలి చిత్రంతోనే హిట్ కొట్టింది. ఆ వెంటనే మహేష్ బాబుతో 'పోకిరి' సినిమాలో నటించి ఇండస్ట్రీ హిట్ తన ఖాతాలో వేసుకుంది. అలా మొదలైన ఇలియానా ప్రస్తానం సౌతిండియాలో స్టార్ హరోయిన్ రేంజికి చేరింది.

తెలుగులో చివరి సారిగా 'దేవుడు చేసిన మనుషులు' చిత్రంలో నటించిన ఇలియనా తర్వాత 'బర్ఫీ' చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంనే విజయం సొంతం చేసుకున్న ఇలియానా.....అక్కడ వరుస అవకాశాలు దక్కించుంది. ఈ క్రమంలో సౌత్ నుండి జెండే ఎత్తేసేందుకు ప్లాన్ చేసుకుంది. అమ్మ ప్రస్తుతం ముంబై స్థిర నివాసం ఏర్పరుచుకన్న ఇలియానా అక్కడ 3.5 కోట్లో విల్లా కొనుగోలు చేసిందట.

English summary
Actress Ileana developed a love towards animals and wanted to contribute to help a veterinary hospital in Mumbai get renovated. She is planning to auction her costumes in facebook for this. Impressed by her ambition, Bollywood filmmaker Varsha Taurani extended his help to her.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu