»   » శక్తి ఫ్లాప్ డిక్లేర్ చేసిన ఇలియానా..కోపడ్డ నిర్మాత..కారణం డైరెక్టర్..

శక్తి ఫ్లాప్ డిక్లేర్ చేసిన ఇలియానా..కోపడ్డ నిర్మాత..కారణం డైరెక్టర్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇటీవల విడుదలైన యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ తాజా చిత్రం 'శక్తి" నందమూరి అభిమానులను నిరుత్సాహపరిచిన సంగతి తెలిసిందే. మొదటి ఆటకే డివైడ్ టాక్ ను తెచ్చుకున్న ఈ సినిమా ఎన్టీఆర్ నట విశ్వరూపం కారణంగానే ఇప్పటి వరకు కొంత మేరకు కలెక్షన్లు రాబట్టింది. ఇక ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద చతికిలబడ్డ ఈ చిత్రం గురించి ఆ చిత్రంలో హీరోయిన్ గా నటించిన గోవాసుందరి ఇలియానే కామెంట్ చేయడం, శక్తి చిత్రం ప్లాఫ్ అని ఆమె డిక్లేర్ చేయడం చర్చనీయాంశమైంది.

బుదవారం నాడు ఓ ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలియానా మాట్లాడుతూ 'శక్తి" లో అన్ని ఎక్కువగానే ఉన్నాయి. ఈ చిత్రంలో నా పాత్రకు కూడా అభినయానికి అవకాశం లేదు. సినిమా ఒప్పుకున్నప్పుడు నాకు ఆ విషయం తెలుసు. నిజం చెప్పాలంటే నేను సినిమా చేసే ముందు విన్నకథకు ఇప్పుడు వెండితెరపై చూస్తున్న కథకు చాలా తేడా వుంది. దానికి కారణం డైరక్టేరే అంటున్నారు ఇలియానా. సినిమా ఫ్లాప్ అయితే డైరెక్టరు అందరికీ లోకువైపోతాడు. అప్పటి వరకు 'డైరెక్టర్ సార్" అంటూ పిలుస్తూ, వంగి వంగి దండాలు పెట్టిన వాళ్ళు సైతం అతని మీద దుమ్మెత్తి పోసేస్తారు. పాపం…ఇప్పుడు 'శక్తి" దర్శకుడు మెహర్ రమేష్ పరిస్థితి కూడా అలాగే వుంది. నిన్నటి వరకు 'ఇంత …అంత…అసలలాంటి దర్శకుడే లేడు" అన్న వాళ్ళు ఇప్పుడు నిందలేస్తున్నారు. వాళ్ళల్లో హీరోయిన్ ఇలియానా కూడా వుంది.

తలాతోకా లేని కథతో 'శక్తి" తీశాడనీ, మొదట తనకి చెప్పిన క్యారెక్టర్ ఒకటి, చివరికి తీసింది మరొకటీ అంటూ మెహర్ ని విమర్శిస్తోంది. ఏం తీస్తున్నాడో తనకే తెలియకుండా, అలా తీస్తూనే ఉన్నాడనీ, అదే కొంప ముంచిందనీ ఆరోపిస్తోంది. తానింకా సినిమా చూడలేదని కూడా చెప్పింది. అయితే, ఇలియానా అసలు బాధేమిటంటే, ఈ సినిమా హిట్ అయితే, పారితోషికం ఇంకా పెంచుదామనుకుందట. సినిమా ఫ్లాప్ అవడంతో అది బెడిసి కొట్టడమే కాకుండా, తగ్గించుకోవాల్సిన పరిస్థితి రావడంతో ఆ కోపాన్నిలా మెహర్ మీద చూపుతోందని అంటున్నారు. అయితే కోటి రూపయల పారితోసికం తీసుకొని తమ సినిమా గురించి చాలా చెప్పడం చిత్ర నిర్మాత అశ్వనీదత్ కి తీవ్ర ఆగ్రహాన్ని కలిగించిందట..

English summary
Ileana D'Cruz has blamed director Meher Ramesh for Shakti's poor performance at the box-office.The movie was released on April 1st and has miserably failed to impress the audience, which has made the actress to open her mouth on its disastrous performance.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu