»   » ఈ అమ్మాకూతుళ్ల వ్యాపారం చివరికి ఏదారి తీస్తుందో!?

ఈ అమ్మాకూతుళ్ల వ్యాపారం చివరికి ఏదారి తీస్తుందో!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

గోవా నుండి వచ్చి తెలుగు ప్రజల మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న మెరుపుతార ఇలియానా. ఎప్పుడూ సినమాలేనా..మనిషికి మనసుకు వేరే ఏదైనా కావాలంటుంది..ఇలియానా..అయితే అది కూడా డబ్బుతోనే ముడిపడి ఉండాలని ఆలోచిస్తుంది. ఇంతకీ ఏం ఆ ఆలోచన అనుకుంటున్నారు?

పేరు మనిషికి మనసుకు అని చెప్పి పైన వ్యాపారం అనే ముసుగు తొడుగుతుంది. ఇలియానా ఆమె తల్లి సమీరాకు కాస్తంత ఫ్యాషన్ మీద పట్టు ఉండటంతో ఇలియానా పేరు మీద కొన్ని దుస్తులను డిజైన్ చేసి అమ్మి సొమ్ము చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు తల్లి కూతుళ్లిద్దరు. అంతే కాదు వీరు డిజైన్ చేసే దుస్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా ఇలియానానే వ్యవహరిస్తుందట. అంతే కాదు వీరు చేసే ఈ అమ్మకం అంతా ఆన్ లైన్ లో మాత్రమేనట.

ఇప్పటికే కొన్ని సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న ఇలియానా.. తన అభిమానులను ఈ విధంగా దోచుకుంటుందన్నమాట. సో ఏప్రిల్ లో హైదరాబాద్ లో మెగా ఫాషన్ షో ను లాంచ్ చేస్తున్నారట. తర్వాత ఇతర సిటీస్ లో ఆ తర్వాత ఇంటర్నేషనల్ లెవల్ లో షోలు పెట్టేసి డబ్బు సంపాదించాలనే. మరి ఈ అమ్మాకూతుళ్ల వ్యాపారం చివరికి ఏదారి తీస్తుందో అని అనుకుంటున్నారు విమర్శకులు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu