»   » అమాయకురాలిని, నన్ను అలా వాడుకున్నారు... సౌత్ దర్శకులపై ఇలియానా ఆరోపణ!

అమాయకురాలిని, నన్ను అలా వాడుకున్నారు... సౌత్ దర్శకులపై ఇలియానా ఆరోపణ!

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ఒకప్పుడు సౌత్ సినిమా పరిశ్రమలో అగ్రహీరోయిన్‌గా వెలుగొందింది ఇలియానా. తెలుగు, తమిళ భాషల్లో దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించే అవకాశం దక్కించుకున్న అమ్మడు దక్షిణాదిన అత్యధిక పారితోషికం అందుకున్న హీరోయిన్ల జాబితాలో చోటు దక్కించుకుంది. తర్వాత సౌత్ సినిమాల్లో నటించడం మానేసి బాలీవుడ్ వైపు అడుగులు వేసిన ఈ సన్ననడుము బ్యూటీ తాజాగా సౌత్ ఇండస్ట్రీపై సంచలన ఆరోపణలు చేస్తోంది.

  Ileana Comments That All Are Interested In My Body Only
   నన్ను గ్లామర్ డాల్‌గా మాత్రమే వాడుకున్నారు

  నన్ను గ్లామర్ డాల్‌గా మాత్రమే వాడుకున్నారు

  సౌత్ సినిమాల్లో తనను కేవలం గ్లామర్ డాల్‌గా మాత్రమే వాడుకున్నారని, ఇక్కడ తాను నటిగా నిరూపించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇక్కడి దర్శకులు తనకు ఆ అవకావం ఇచ్చేవారు కాదని ఇలియానా ఆరోపించారు.

   నా అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్నారు

  నా అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్నారు

  18 ఏళ్ల వయసులోనే నేను సినిమాల్లోకి వచ్చాను. తెలుగు, తమిళంలో ఎక్కువ అవకాశాలు రావడంతో నటిస్తూ వెళ్లాను. నా అమాయకత్వాన్ని ఆసరగా చేసుకుని కేవలం గ్లామర్ పాత్రలే ఇచ్చేవారు, పెద్దగా నటించకపోయినా ఫర్వాలేదు, చిట్టిపొట్టి డ్రెస్సులు వేసి గ్లామర్ షో చేస్తే చాలు అనే విధంగా వారి వ్యవహారం ఉండేది అని ఇలియానా చెప్పుకొచ్చారు.

  హిందీ పరిశ్రమ, దర్శకులు చాలా బెటర్

  హిందీ పరిశ్రమ, దర్శకులు చాలా బెటర్

  సౌత్ సినీ పరిశ్రమతో పోలిస్తే హిందీ పరిశ్రమ, ఇక్కడి దర్శకులు చాలా బెటర్. ఇక్కడ గ్లామర్ పాత్రలతో పాటు నటనకు అవకాశం ఉండే పాత్రలు కూడా ఇస్తూ తనను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు అని ఇలియానా తెలిపారు.

   నా డ్రీమ్ నిజం అవుతోంది

  నా డ్రీమ్ నిజం అవుతోంది

  సినిమాల్లో ఒక మంచి నటిగా పేరు తెచ్చుకోవాలనేది నా డ్రీమ్. హిందీ చిత్ర సీమలో నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు వస్తుండటంతో నా కల నిజం అవుతోంది. ఇక్కడ అందరినీ సమానంగా చూస్తారు, నటన పరంగా మంచి ప్రోత్సాహం లభిస్తుంది అని ఇలియానా తెలిపారు.

   ఇలియానా బాలీవుడ్ ప్రాజెక్టులు

  ఇలియానా బాలీవుడ్ ప్రాజెక్టులు

  2012లో ‘బర్ఫీ' సినిమా ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఇలియానా మళ్లీ సౌత్ సినిమాల వైపు చూడలేదు. హిందీలో ఆమె ఇప్పటి వరకు పతా పోస్టర్ నిక్లా హీరో, మే తేరా హీరో, హ్యాపీ ఎండింగ్, రుస్తుం, ముబారకన్, బాద్‌షాహో చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ‘రైడ్' అనే చిత్రంలో నటిస్తోంది.

  English summary
  Recently during an interview, Iliana was asked about her take on South Film Industry. The actress said, “In my first ever shot, there was a big shell dropped on my belly in slow motion. I even asked the director why we are doing it and he said it would look beautiful. Each time it happened, I was told, ‘you’ve got a very attractive waist, it’ll look pretty and it’s very feminine, but I truly didn’t understand it.”
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more