»   » వాళ్ళకు ఇలియానా అంటే పిచ్చి..దాన్నే క్యాష్ చేసుకుంది

వాళ్ళకు ఇలియానా అంటే పిచ్చి..దాన్నే క్యాష్ చేసుకుంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలనే ఆలోచన ఇలియానాలో ఎక్కువైనట్లుంది. దానికి నిదర్శనంగా తాజాగా ఓ కన్నడ చిత్రంలో స్పెషల్ సాంగ్ లో అలా కనపడి వెళ్ళటానికి ఆమె ముప్పై లక్షలు డిమాండ్ చేసి వసూలు చేసింది. అయితే అసలు ట్విస్టు ఏమిటంటే సినిమా అంతా చేసినా కూడా అక్కడ హీరోయిన్స్ కి అంత రెమ్యునేషన్ తీసుకునే సీన్ లేదు. దాంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. హుడక్‌ హుడకి పేరుతో రూపొందుతున్న ఓ చిత్రంలో ఇలియనా ఈ స్పెషల్‌ సాంగ్‌ చేస్తోంది.ఇక ఇలియానా కేవలం ఒక్క రోజే షూటింగ్‌లో పాల్గొంది. ఈ పాటను గోవాలో చిత్రీకరించారు. ఇక చాలా మంది ఆ కాస్సెపు కనపడటానికి ఆ ఎమౌంట్ బాగా ఎక్కువ అని ఆ నిర్మాతకు చెప్పి చూసారు. అయితే ఇలియానా అంటే వీర పిచ్చితో ఆ నిర్మాత అలా చేసారని కన్నడ ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu