»   » పబ్లిక్ లో నా డ్రెస్ ఓపెన్ అయిపోయింది అయినా: ఇలియానా

పబ్లిక్ లో నా డ్రెస్ ఓపెన్ అయిపోయింది అయినా: ఇలియానా

Posted By:
Subscribe to Filmibeat Telugu

సెలబ్రిటీ జీవితాలు మనం అనుకున్నంత వీజీ కాదు. ప్రతీక్షణం వారి మీద ఒక స్పెషల్ లుక్ ఉంటుంది. ప్రతీ పని నీ ఆలోచించి చేయాలి, మాట్లాడే ప్రతీ మాటా ముందూ వెనుకా ఆలోచించి చేయాలి లేనటే మరుక్షనం ట్రోలింగ్ మొదలైపోతుంది. డ్రెస్సింగ్, బాడీ లాంగ్వేజ్, చూపులూ, మాటలూ అన్నీ జాగ్రత్తగా మెయింటెయిన్ చేయాలి.

కొన్ని సందర్భాలలో పబ్లిక్ గా ఎంబరాసింగ్ ఫీలయ్యే సందర్భాలూ వస్తాయి. డ్రెస్ లో ఏమాత్రం తేడా ఉన్నా చుట్టూ పదుల కెమెరాలు డేగ కళ్ళతో ఎదురు చూస్తూంటాయి. ఇలాంటి ఇబ్బంది సినీ తారలకు అందులోనూ హీరోయిన్లకే ఎక్కువ. అలాంటి సందర్భమేమైనా ఉందా అని ఇలియానాని అడిగితే ఇలా చెప్పుకొచ్చింది...

Ileana embarrassing moments in public

రెండు సందర్భాలు మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను' అని చెప్పింది ఇల్లీ బేబీ. 'బర్ఫీ మూవీ కోసం అవార్డ్ అందుకునేందుకు స్టేజ్ పైకి వెళ్లాను. ఆ టైంలో మొత్తం టీం అంతా అక్కడే ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో నా డ్రెస్ వెనుక వైపు చీలిపోయింది. అయితే.. నేను మాత్రం ఏం జరగనట్లుగా మేనేజ్ చేశాను. సైలెంట్ నా అవార్డ్ తీసుకుని వచ్చేసి.. నా ఛైర్ లో కూర్చుండి పోయాను' అని చెప్పింది ఇలియానా.

'ఇలాంటిదే మరొకటి కూడా జరిగింది. ఓ బుక్ లాంచింగ్ ఈవెంట్ లో స్టేజ్ పైకి వెళుతున్నపుడు.. సరిగ్గా నా వెనుకవైపున డ్రెస్ చిరిగిపోయింది. అదృష్టం ఏంటంటే.. ఎవరూ ఆ విషయాన్ని గమనించలేదు. నేను కూడా ఏమీ రియాక్ట్ కాకుండా.. సాధారణంగానే కంటిన్యూ చేసేశాను. కనీసం ఎవరికీ అనుమానం కూడా రాలేదు' అని చెప్పిన ఇలియానా.. 'అలాంటి సమయాల్లో ఓవర్ రియాక్ట్ అయ్యి అందరికీ తెలియచెప్పే కంటే.. సైలెంట్ గా మన పని చేసుకుంటే.. ఎవరూ పసిగట్టలేరు' అంటూ సలహా కూడా ఇచ్చేసింది.

English summary
According to the Iliana, she has not had one, but too many ‘oops’ moments. Talking about a couple of such moments, Ileana shares the art of managing the uneasy moments brilliantly.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu