For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఇలియానాకు తెలుగులో బ్యాన్

  By Srikanya
  |

  హైదరాబాద్: ఇలియానాకు తెలుగులో ఒక్క సినిమా కూడా లేకుండా పోయింది. ఆమెపై అనఫీషియల్ గా బ్యాన్ రన్ అవుతున్న వాతావరణం కనిపిస్తోంది. వరసగా ఆమె చేసిన చిత్రాలు స్నేహితుడా, జులాయి, దేవుడు చేసిన మనుష్యులు విడుదల అయ్యాయి. అయితే జులాయి తప్ప మిగతా రెండూ భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యాయి. జులాయి సైతం ఇలియానాకు ప్రత్యేకమైన ఆఫర్స్ తెచ్చిపెట్టలేకపోయింది. దానికి తోడు ఈ చిత్రం ప్రమోషన్ లో ఇలియానా పాల్గొనకపోవటం బాగా హైలెట్ అయ్యింది. దాంతో ఇండస్ట్రీలో ఆమె అంటే నెగిటివ్ ఇంప్రెషన్ వెళ్లింది. ఆమె సినిమాకు ప్లస్ కావచ్చు కానీ,సినిమాకు ప్లస్ అయ్యే ప్రమేషన్ ని పట్టించుకోకపోతే కష్టం అని నిర్మాతలు అంటున్నారు.

  తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడు ఇలియానా పేరు చెపితే మండిపడుతోంది. దానికి కారణం ఆమె జులాయి ప్రమోషన్ కి రాకుండా భాధ్యతారాహిత్యంగా ప్రవర్తించటమే అంటున్నారు. జులాయి ఆడియోకి సైతం డుమ్మా కొట్టిన ఈ ముద్దుగుమ్మ దృష్టి మొత్తం బాలీవుడ్ మీదే ఉండటంతో తెలుగుపై ఆమె పెద్దగా ఆసక్తి చూపించటం లేదని అంటున్నారు. దాసరి నారాయణ రావు సైతం ఆమె పై అప్పుడు మండిపడ్డారు. అలాగే అల్లు అర్జున్ సైతం ఇక తాను ఇలియానాతో చేయనని నిర్ణయించుకున్నారు. నిజానికి త్రివిక్రమ్ ఈమెని తను పవన్ తో చేయబోతే తదుపరి చిత్రంలోనూ తీసుకుంటాడని వినిపించింది. ఇప్పుడు అది విరమించుకున్నాడని చెప్తున్నారు.

  జులాయి ఓకే అనిపించుకున్నా ఆమెకు త్రివిక్రమ్ కరువు కంట్రీకి బ్రాండ్ అంబాసిడర్ అంటూ కామెంట్ చేసి మరీ అలాగే చూపెట్టాడు. దాంతో ఆమెకు తెలుగులో ఊహించిన క్రేజ్ రాలేదు. దాంతో ఇలియానా ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. సాధారణంగా మంచి సక్సెస్‌ ఉంటేనే ఇక్కడ ఇండస్ట్రీ పట్టించుకుంటుంది. అలాంటిది వరసగా ఫెయిల్యూర్ లో ఉన్న ఆమె సన్నబడి మరీ అందం కూడా లేకుండా పోవటం ఆమెకు మైనస్ గా మారింది. అయితే ఆమె హిందీలో సినిమాలు చేస్తూండటంతో ధైర్యంగా ఉంది.

  ఇలియానా మాత్రం ఈ విషయాన్ని లైట్ గా తీసుకుంటోంది. ఆమె మాట్లాడుతూ...''బర్ఫీ విజయం సంతోషాన్నిచ్చింది. నాకు అన్ని భాషలూ ఒక్కటే. కానీ ప్రస్తుతం బాలీవుడ్‌పై దృష్టిపెడుతున్నా'' అంది. ప్రస్తుతం ఈ గోవా భామ తమిళ,హిందీ భాషల్లోనూ ఆమె బిజిగా ఉంది. సిని జీవితం గురించి ఇలియానా మాట్లాడుతూ ''కెరీర్‌లో ఎత్తుపల్లాలు సహజమే. విజయంవచ్చిందంటే... వెన్నంటే ఓటమి ఉంటుంది. కెరీర్‌ ప్రారంభంలో వరుసగా సినిమాలు చేశా. మధ్యలో ఆ వేగం తగ్గింది. కానీ ఇప్పుడు మళ్లీ మునుపటి జోరు వచ్చేసింది. మరోవైపు బాలీవుడ్‌లో అడుగుపెట్టడం కూడా ఆనందంగా ఉంది''అని చెప్పింది.

  'బర్ఫీ'తో హిందీలో తొలి అడుగు వేసింది ఇలియానా. మొదటి చిత్రంతోనే విజయాన్ని అందుకొందీ భామ. షాహిద్‌ కపూర్‌తో కలిసి తాజాగా ఓ చిత్రంలో నటిస్తోంది. ఇక ముంబైలోనే స్థిర నివాసం ఏర్పరచుకొనేందుకు ఇలియానా ప్రణాళిక సిద్ధం చేసుకొంటోంది. ఆ నగరంలో ఇంటి కోసం వేట మొదలుపెట్టింది. ''నా అభిరుచికి తగ్గ ఇంటి కోసం అన్వేషిస్తున్నాను. ముంబైలో ఉంటేనే నాకు సౌకర్యంగా ఉంటుంది. అటు దక్షిణాది, ఇటు హిందీ చిత్రాలు చేయాలంటే గోవాలో ఉంటే వీలుపడదు. తెలుగు సినిమా ద్వారానే నేను నటనలో పాఠాలు నేర్చుకొన్నాను. బర్ఫీలో శ్రుతి పాత్రలో పరిపక్వత కనిపించిందనే ప్రశంసలు లభించడం సంతోషాన్నిచ్చింది'' అని చెప్పింది ఇలియానా.

  English summary
  Ileana broke her string of failures with Allu Arjun starrer Julayi, but it seems her starry tantrums have not gone down too well with the filmmakers. The actress happily missed the pre-release promotional activities despite charging a bomb for the film. But she was seen touring the whole country to promote her maiden Hindi flick, Barfi!
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X