»   » ఇలియానా...సిలికాన్‌ ట్రీట్‌మెంట్ చేయించుకుందా?

ఇలియానా...సిలికాన్‌ ట్రీట్‌మెంట్ చేయించుకుందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నయ్‌ లో జరిగిన ఓ ఫంక్షన్ లో పాల్గొన్నప్పుడు కొంతమంది మీడియావారు 'మీరు సిలికాన్‌ ట్రీట్‌మెంట్‌' చేయించుకున్నారట గదా? అని అడిగారు. పెద్ద జోక్‌ విన్నట్లుగా పగలబడి నవ్వేశాను. అలాంటి శస్త్ర చికిత్స చేయించుకోవాలని నేను కలలో కూడా అనుకోను. నా శరీరంతో నేను ప్రయోగాలు చేయను అంటోంది ఇలియానా. ఆమె లేటెస్ట్ గా మీడియాతో మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చింది. అలాగే స్వతహాగా నేను చాలా సున్నితమైనదాన్నిని, అనుభవాలు నేర్పిన పాఠంతో ఇప్పుడు కొంచెం కఠువుగా మారానని చెప్పుతోంది. అలాగే తనకు ఈగో లేదని చెప్తోంది.ఈ విషయం ఆమె మాటల్లోనే...అందరితోనూ స్నేహంగా ఉంటాను. ఈగోయిస్ట్‌ లకు మాత్రం సాధ్యమైనంతవరకు దూరంగా ఉంటాను.

అలాగే నాలో ఉన్న తప్పులను ఎత్తి చూపించాలని ఎవరైనా అనుకుంటే అసలే మాత్రం ఫీల్‌ కాను. కానీ ఏదో సలహాలివ్వాలి కదా అని లేని తప్పులు కూడా కల్పించి సలహా ఇస్తే మాత్రం ఊరుకోను. నేనెవరికీ ఉచిత సలహాలివ్వను..నాకెవరైనా ఇవ్వబోతే ఇక ఆపండనే టైప్‌ లో వ్యవహరిస్తాను అంది. అలాగే తాను ప్రస్తుతం తెలుగులో 'శక్తి' చిత్రంలో నటిస్తున్నాను అంది. నటిగా నా ఖాతాలో నమోదు కాబోయే మరో సక్సెస్‌ఫుల్‌ మూవీ ఇది గర్వంగా చెప్తోంది. అలాగే విక్రమ్‌ హీరోగా తమిళ దర్శకుడు భూపతి పాండ్యన్‌ దర్శకత్వం వహించనున్న ఓ చిత్రంలో నటించడానికి కథ విన్నాను. నాకైతే కథ బాగా నచ్చింది. ఇంకా అగ్రిమెంట్‌ కుదుర్చుకోలేదు. చర్చల దశలోనే ఉంది. ఒకవైపు కెరీర్‌ని ఎంజాయ్‌ చేస్తూనే మరోవైపు నా వ్యక్తిగత జీవితానికి కూడా కొంత సమయం కేటాయిస్తూ ఎంజాయ్‌ చేస్తున్నాను అని చెప్పుకొచ్చింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu