»   » ఇక సినిమా సెట్లోకి వెళ్లలేనన్న విషయం తెలిసి ఏడుపొచ్చేసింది: ఇలియానా

ఇక సినిమా సెట్లోకి వెళ్లలేనన్న విషయం తెలిసి ఏడుపొచ్చేసింది: ఇలియానా

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీ వుడ్ లో ఇప్పుడున్న హీరోయిన్లు అంతా దాదాపు నార్త్ ఇండియానుంచి వచ్చిన వారే, లేదంటే దక్షిణాది తమిళ మళయాలీ భామలే మొత్తానికి ఎవరు ఎక్కన్నుంచి వచ్చినా తెలుగులో కాస్త టాప్ రేంజ్ కి వెళ్ళగానే చూపు బాలీవుడ్ మీదికి మళ్ళుతుంది.. అప్పటి శ్రీదేవిలాగా ఇక్కన్నుంచి వెళ్లీ అక్కడ ఊపూఉపేయాలని కలలు కనే వాళ్ళే... కానీ ఆ స్తానాన్ని ఎవరూ అందుకోలేకపోయారు ఒకటీ అరా సినిమాలు చేయటం తప్ప పెద్ద గుర్తింపేం రాలేదు. అదే బాటలో టాలీవుడ్ టూ బాలీవుడ్ ప్రయాణం కట్టిన సన్ననడుం పిల్ల ఇలియానా కూడా...

"బర్ఫీ" సినిమాతో ఎంట్రీ బాగానే జరిగింది కానీ.. పెద్దగా అవకాశాలు రాలేదు. సైఫ్ అలీఖాన్ సరసన "హ్యాపీ ఎండింగ్" చేశాక ఆమె కెరీర్ చతికిల బడింది. ఏడాదికి పైగా ఒక్క అవకాశం లేక.. కేవలం ఫొటో షూట్లు, ఫ్యాషన్ షోలు చేసుకుంటూ నెట్టుకొచ్చింది ఇల్లీ బేబీ.అక్కడ లేకపోగా తెలుగులోనూ అవకాశాలు తగ్గుముఖం పట్టాయి.

లేక లేక అక్షయ్ కుమార్ సినిమా 'రుస్తుం'లో ఛాన్స్ వచ్చాక ఆమె ఆనందానికి అవధుల్లేవు. ఈ సినిమా కేవలం అక్షయ్ కుమార్ రెకమండేషన్ వల్లే వచ్చిందంటారు ముంబయి జనాలు. ఇప్పుడు ఇల్లీ మాటలు చూస్తే ఆ ప్రచారమే నిజమేమో అనిపిస్తోంది. అమాంతం ఆకాశానికెత్తింది.

 Ileana Praises Akshay Kumar after Working in Rustum

అక్షయ్ కుమార్ సూపర్ స్టార్ కాదు అంటే తాను ఒప్పుకోననీ,. "అక్షయ్ తో పని చేయడం చాలా గొప్పగా అనిపించింది. అయ్ మోస్ట్ అండర్ రేటెడ్ హీరో. అతనో సూపర్ స్టార్. అందులో సందేహమే లేదు. ఇక అతడి నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. నటనలోనూ అక్షయ్ సూపర్ స్టారే. అతడి యాక్టింగ్ స్కిల్స్ గురించి పెద్దగా ఎవరూ మాట్లాడక పోవటం ఆశ్చర్యంగానే అనిపిస్తుంది" అంటూ అక్షయ్ ని తెగ మోసేసింది.

ఇక రుస్తుం సినిమాలో నటించిన అనుభవం గురించి చెబుతూ.. "ఓ సినిమా పూర్తయ్యాక నేను పెద్దగా ఎమోషనల్ అవను. కానీ ఈ సినిమా పూర్తయినపుడు మాత్రం చాలా బాధగా అనిపించింది. ఇంత భారీ సినిమాను ఇంత త్వరగా ఎందుకు పూర్తి చేసేశారో అనిపించింది. మళ్లీ ఈ సినిమా సెట్లోకి వెళ్లలేనన్న విషయం తెలిసి ఏడుపొచ్చేసింది" అంటూ అక్షయ్ ని మరీ మరీ అదే పని అన్నట్టుగా పొగిడింది... మరి ఈ పొగడ్తలకి అక్షయ్ పడిపోతాడా..? ఇంకో చాన్స్ ఇస్తాడా..?

English summary
ileana dcruz talks about her next film "Rustom", which stars Akshay Kumar.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu