»   » పూరీ దర్శకత్వంలో ఇలియానా మరోసారి

పూరీ దర్శకత్వంలో ఇలియానా మరోసారి

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇలియానా,పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో గతంలో పోకిరి,ఆ తర్వాత నేనూ నా రాక్షసి చిత్రాలు వచ్చాయి.మొదటి సూపర్ హిట్టు,రెండోది సూపర్ ప్లాపు.ఇప్పుడు మరో సారి ఈ కాంబినేషన్ తో సినిమా రానుంది. రవితేజ హీరోగా ఇడియట్ సీక్వెల్ ని పూరీ ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే.దాంతో ఆ చిత్రంలో హీరోయిన్ గా ఇలియానాని ఎంపిక చేసారు.ఇలియానా,రవితేజ కాంబినేషన్ లో గతంలో కిక్ చిత్రం వచ్చి సూపర్ హిట్టవటంతో క్రేజ్ వస్తుందని భావిస్తున్నార.జనవరి నుంచి ప్రారంభమయ్యే ఈ చిత్రం స్క్రిప్టు ఇప్పటికే పూర్తయైంది.ఇక గతంలోనూ రవితేజ,ఇలియానా కాంబినేషన్ లో మొదట ఖతర్నాక్ చిత్రం వచ్చి డిజాస్టర్ అయింది.అయితే కిక్ ఇచ్చిన కిక్ ఈ చిత్రానికి మార్కెట్లో కిక్ ఇస్తుందని భావిస్తున్నారు. మొత్తానికి మళ్లీ ఇలియానా తెలుగు సినిమాలు ఓకే చేస్తోంది.అల్లు అర్జున్ సరసన ఆమెను త్రివిక్రమ్ సినిమాకు అనుకున్నారు కానీ ఇంకా ఫైనల్ కాలేదు. ప్రస్తుతం శంకర్ దర్సకత్వంలో రూపొందుతున్న తమిళ చిత్రం నన్భన్ లో ఆమె చేస్తోంది.

English summary
Ravi Teja will romance Ileana in director Puri Jagannadh's sequel to Idiot. Idiot 2 will go to the sets in January 2012.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu