»   » ఆమె సినిమాలు చూసి రీఛార్చ్‌ అవుతా: ఇలియానా

ఆమె సినిమాలు చూసి రీఛార్చ్‌ అవుతా: ఇలియానా

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : సాధారణంగా సినీ పరిశ్రమలో ఒక హీరోయిన్‌ అంటే మరో హీరోయిన్‌కి పడదు అంటారు. కానీ, ఇలియానాకి మాత్రం కత్రినా కైఫ్‌ అంటే చాలా ఇష్టమని చెప్తోంది. ఇప్పుడిప్పుడే హిందీలో నిలుదొక్కుకునే ప్రయత్నాలు చేస్తున్న ఆమె అక్కడ హీరోయిన్స్ ని పొగడ్తల్లో ముంచెత్తుతోంది.


ఇలియానా మాట్లాడుతూ... 'కత్రినా అంటే చాలాచాలా ఇష్టం. ఇంకా చెప్పాలంటే... నాకు స్ఫూర్తి కూడా. ఎందుకంటే, ఆమె బాలీవుడ్‌కి వచ్చేనాటికి ఇక్కడి భాష తెలీదు. పరిశ్రమ తీరు తెన్నులు తెలీవు. అయినాసరే, పట్టుదలతో ఎదిగింది. మొదట్లో ఎన్నో విమర్శల్ని ఎదుర్కొంది. అయినా రాజీ పడలేదు. తెలియని విషయాలన్నీ నేర్చుకుంటూ ఈరోజున నంబర్‌ వన్‌ హీరోయిన్‌గా నిలదొక్కుకుంది. ఆమెలోని పోరాట పటిమ చాలా ఇష్టం. నాకు ఎప్పుడైనా మూడ్‌ ఆఫ్‌ అనిపిస్తే కత్రినా నటించిన సినిమాలు చూసి రీఛార్చ్‌ అయిపోతుంటాను' అని చెప్పుకొచ్చింది ఇలియానా.


తెలుగులో రామ్ హీరోగా వచ్చి ఘన విజయం సాధించిన చిత్రం 'కందిరీగ'. హన్సిక హీరోయిన్ గా చేసిన ఈ సినిమా 'మై తేరా హీరో' పేరుతో హిందీలో రీమేక్ అవుతోంది. డేవిడ్ ధావన్ డైరెక్ట్ చేస్తున్న ఆ సినిమాలో ఆయన కుమారుడు వరుణ్ ధావన్, ఇలియానా హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఏక్తా కపూర్ నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని 'కందిరీగ' దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ ఖరారు చేసి చెప్పారు.


అలాగే ... బర్ఫీతో హిందీలోకి అడుగుపెట్టిన ఆమె ప్రస్తుతం షాహిద్‌ కపూర్‌తో నటిస్తోంది. ఇప్పుడు మూడో చిత్రం కూడా సిద్ధమైంది. త్వరలో ఆమె సైఫ్‌ అలీఖాన్‌తో కలిసి నటించబోతోంది. ఈ సినిమాకి రాజ్‌ నిడిమోరు, కృష్ణ డి.కె. సంయుక్తంగా దర్శకత్వం వహిస్తారు. సైఫ్‌ నిర్మాతగా వ్యవహరిస్తారు. త్వరలో చిత్రీకరణకు సంబంధించిన వివరాలు వెల్లడవుతాయి.

English summary
Iliyana is busy with Bollywood projects. She says that she is 's fan of Katrina kaif. She said that when tired she used to see Katrina films.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu