»   » జూ ఎన్టీఆర్ ‌లో ఫైర్‌ చూస్తున్నా: ఇలియానా

జూ ఎన్టీఆర్ ‌లో ఫైర్‌ చూస్తున్నా: ఇలియానా

Posted By:
Subscribe to Filmibeat Telugu

'శక్తి'లో ఎన్టీఆర్‌తో చేస్తున్నా. 'రాఖీ' టైమ్‌లో ఎన్టీఆర్‌లోని ఫైర్‌ని చూశా. ఇప్పుడు స్లిమ్‌ అయిన ఎన్టీఆర్‌ లో ఫైర్‌ తో పాటు చురుకుదనాన్ని కూడా చూస్తున్నా' ఈ రెండు అతనిలో ప్లస్‌ పాయింట్స్ అంటూ చెప్పుకొచ్చింది ఇలియానా. ఇలియానా ప్రస్తుతం ఎన్టీఆర్ సరసన 'శక్తి' చిత్రంలో చేస్తోంది. మెహర్ రమేష్ దర్శకత్వంలో రెడీ అవుతున్న ఈ చిత్రం షూటింగ్ నిరవధికంగా జరుగుతోంది. ఇంతకు ముందు ఆమె కృష్ణవంశీ దర్శకత్వంలో ఎన్టీఆర్ సరసన 'రాఖీ' చిత్రం చేసింది. ఆ విషయాలను గుర్తు చేసుకుంటూ...రాఖీ'లో నా సీన్స్‌ ఇప్పుడు చూస్తుంటే... నేనేనా అలా చేసింది అనిపిస్తుంది. నటీనటుల నుంచి నటనను రాబట్టుకోవడంలో కృష్ణవంశీ నిజంగా దిట్ట. అందులోనూ ఎన్టీఆర్‌ లాంటి మంచి ఆర్టిస్ట్‌ పక్కన ఉండటంతో...చాలా జాగ్రత్త పడ్డాను అంటోంది. అలాగే తను వైవియస్ చౌదరితో చేసిన దేవదాస్ నాటి అనూభవాలు గుర్తు చేసుకుంటూ..."అసలు నేను ఇష్టం లేకుండానే నటిని అయ్యాను. తొలి సినిమా మొత్తం దర్శకుడు ఏం చెబితే అది చేశా...అంతే. ఆ సినిమా విజయం సాధించడంతో... నటనలోని గమ్మత్తేమిటో అర్థమైంది. సీన్‌లో లీనమై నటించడం అలవాటు చేసుకున్నాను.' అంటోంది ఇలియానా. ఇక రెండోసారి వైవియస్ చౌదరితో ఆమె సలీం చిత్రం చేసింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu