»   » నేనెంత తెలివితక్కువదాన్నో అర్థమైంది: ఇలియానా

నేనెంత తెలివితక్కువదాన్నో అర్థమైంది: ఇలియానా

Posted By:
Subscribe to Filmibeat Telugu

గోవా వచ్చి ఎంజాయ్‌ చేసే ఇతర దేశాల టూరిస్టులను చూసి, వారి దేశాలు అంత అందంగా ఉండవేమో...అందుకే మా గోవాకు వస్తారేమో... అనుకుని తెగ గర్వపడిపోయేదాన్ని. కాని నేనెంత తెలివితక్కువదాన్నో ఇప్పడు అర్థమైంది. హీరోయిన్ గా ప్రపంచదేశాలన్నీ తిరుగుతుంటే... నేను బావిలో కప్పనన్న నిజం తెలిసింది. అప్పటి నా ఆలోచనలు గుర్తొస్తే.. భలే నవ్వొస్తుంది. దేశవిదేశాలు తిరగడం వల్ల అటు భగవంతుని సృష్టినీ.. ఇటు మానవుని ప్రతిసృష్టినీ రెండూ చూసే అవకాశం లభించింది నాకు.అందుకే సినిమాకి థ్యాంక్స్‌ చెప్పుకుంటున్నా' అని చెప్పుకొచ్చారు ఇలియానా. ప్రస్తుతం ఇలియానా...ఎన్టీఆర్ ‌తో 'శక్తి' సినిమాలో చేస్తోంది. అలాగే పవన్‌ కళ్యాణ్‌ సరసన లవ్ ఆజ్ కల్ రీమేక్ చిత్రంలో నటించనున్నారు. శంకర్‌, మహేష్ ‌బాబలు కాంబినేషన్‌లో రూపు దిద్దుకోనున్న 'త్రీ ఇడియట్స్‌' రీమేక్‌లో కూడా ఇలియానానే ఎంపిక చేసారనే వార్తలు వస్తున్నాయి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu