»   » రాక్షసి క్యారెక్టర్‌ కూడా అలాంటిదే...ఇలియానా

రాక్షసి క్యారెక్టర్‌ కూడా అలాంటిదే...ఇలియానా

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇంతకు ముందు'రాఖీ' సినిమాలో మంచి పాత్ర లభించింది.ఇప్పుడీ రాక్షసి క్యారెక్టర్‌ కూడా అలాంటిదే. 'నేను నా రాక్షసి' సినిమాలో తన పాత్ర గురించి చెప్తోంది ఇలియానా. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రం గురించి మాట్లాడుతూ.. 'నేను నా రాక్షసి'సినిమాలో నా పాత్రలో కొంతవరకు నన్ను నేను తరిచి చూసుకున్నా. నిజ జీవితానికి దగ్గరగా ఉండే కథనం.చాలా స్ట్రాంగ్‌ వుమెన్‌ రోల్‌ ఇది. తెలివైన అమ్మాయి.ఈ మధ్య కాలంలో నాకు బాగా నచ్చిన సినిమా ఇది అంది.

అలాగే టైటిల్ గురించి చెప్తూ అసలు ఈ టైటిల్‌ నాకు భలే అనిపించింది. మొదట్లో 'రాక్షసి' ఏమిటి? అనుకున్నాను. షూటింగ్‌ చేస్తున్న కొద్దీ క్యారెక్టర్‌లో వున్న డెప్త్‌ తెలిసి, ఆ పాత్ర అంటే తెలియని ఇష్టం ఏర్పడింది. షూటింగ్‌ బాగా ఎంజారు చేశాం. అభినయానికి అవకాశమున్న రోల్‌. దర్శకుడు పూరి మోస్ట్‌ టాలెంటెడ్‌ టెక్నీషియన్‌. ఏ ఆర్టిస్ట్‌ను ఎలా ఉపయోగించుకోవాలో ఆయనకు బాగా తెలుసు. తొలిసారి ఆయనతో 'పోకిరి' చేశాను. అప్పుడు నేను కొత్త కిందే లెక్క. అనుభవం కూడా లేదు. నాతో చాలా ఈజీగా చేయించారు అంది.

ప్రస్తుతం ఇలియానా..రానాతో నేనూ నా రాక్షసి, పవన్ ‌కళ్యాణ్‌తో ఓ సినిమా, మహేష్‌బాబుతో మరో సినిమా, ప్రభాస్‌తో ఓ సినిమా చేస్తోంది. రెమ్యునేషన్ కూడా పెంచిన ఈ భామ టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. త్వరలో బాలీవుడ్ లో కూడా ప్రవేశించి హిట్స్ కొడతానని నమ్మకంగా చెప్తోంది.

English summary
The talk has begun about her new movie ‘Nenu Naa Rakshasi’ and the grapevine is that it is going to be a Mind Blowing Treat which will be bigger than ‘Idiot’ and punchier than the comedy in ‘Pokiri’.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu