»   » ఇలియానా అందుకు సై అంటుందా ససేమిరా అంటుందా...

ఇలియానా అందుకు సై అంటుందా ససేమిరా అంటుందా...

Posted By:
Subscribe to Filmibeat Telugu

అందలా బ్యూటి ఇలియానాకు బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ బసు రూపొందించే 'సైలెంట్" చిత్రంలో ఒక హీరోయిన్ గా రణ్ భీర్ కపూర్ నటించే అవకాశం వచ్చిందనే విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలో ముగ్గురు కథానాయికల్లో ఒక నాయికగా నటించే అవకాశం అని ఒప్పుకోవాలో..తప్పుకోవాలో ఎటూ తేల్చుకోని సందిగ్థంలో పడింది ఈ ముద్దుగుమ్మ. టాలీవుడ్ లో అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా తన హవాను కొనసాగిస్తున్న ఈ అమ్మడు బాలీవుడ్ లో మొట్టమొదటి సారిగా వచ్చిన ఈ అవకాశంలో మూడో హీరోయిన్ గా నటించడమా..?లేక ససేమిరా అంటుందా..? అని తల బద్దలయ్యేలా ఆలోచితస్తుందని సమాచారం.

రణబీర్ కపూర్ హీరోగా అనురాగ్ బుసు రూపొందించే ఈ చిత్రంలో ఇప్పటికే ఒక హీరోయిన్ గా ప్రియాంకా చోప్రా ఎంపికయింది. ఇంకో హీరోయిన్ గా మొదట కత్రినా కైఫ్ ను అనుకున్నప్పటికీ, తనకి డేట్స్ అడ్జెస్ట్ కావని కత్రినా చెప్పడంతో ఆ స్థానంలో అసిన్ ను తీసుకున్నారు. మూడో హీరోయిన్ గా ఇలియానాను తీసుకోవాలని, దర్శకుడు అనురాగ్ అనుకున్నాడని, అందుకు రణ్ బీర్ కపూర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు బాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తోన్నాయి. అయితే ఈ ఆఫర్ ను అంగీకరించాలా..?వద్దా అన్నఆలోచనలో ఇలియానా ఊగిసలాడుతోదని తెలుస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ ఉన్న పోటీని దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తే..అవకాశాలు అక్కడ అంత తేలిగ్గా ఏమీ వచ్చే పరిస్థితులు లేవు. అలా అని తనని వెతుక్కుంటూ వచ్చిన ఈ సువర్ణావకాశాన్ని ఈ అమ్మడు అందిపుచ్చుకుంటుందో..లేక సారీ చెప్పి వదిలేసుకుంటుందో వేచి చూడాల్సిందే...

English summary
Ileana may soon move to Bollywood if the offer from Anurag Basu clicks.The director has problems signing up the second heroine for his forthcoming flick with Ranbir Kapoor and Priyanka Chopra in the lead.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu