»   » నాకు ఇష్టమైన హీరో ఎవరంటే...ఇలియానా

నాకు ఇష్టమైన హీరో ఎవరంటే...ఇలియానా

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఎంత హీరో,హీరోయిన్స్ అయినా వారికంటూ కొన్ని అభిరుచులు, ఇష్టాలు ఉంటాయి. తాజాగా ఇలియానా తనకు నచ్చిన హీరో,హీరోయిన్స్, సినిమా గురించి చెప్పుకొచ్చింది. ఆమె మాటల్లోనే..ఒకప్పుడు షారుఖ్ ఫ్యాన్ ని నేను. .ఆ తర్వాత హృతిక్‌ని ఇష్టపడ్డా. ఇప్పుడేమో సైఫ్ అలీఖాన్ అంటే ఇష్టం అంటూ తనకు నచ్చిన హీరోల గురించి చెప్పింది. మరి తెలుగు హీరోల్లో ఎవరిని ఇష్టపడతారు అనడిగితే ...ప్లీజ్ ఇలాంటి ప్రశ్నలతో ఇరకాటంలో పెట్టకండి ప్లీజ్. ఇక్కడి హీరోలందరూ నా అభిమాన న టులే. ఒక్కొక్కరిలో ఒక్కో ప్రత్యేకత ఉంది అంటూ తెలివిగా సమాధానమిచ్చింది.

అలాగే తనకు నచ్చిన ఎవర్ గ్రీన్ సినిమా ... దిల్‌వాలే దుల్హానియా లేజాయింగే చిత్రం అని చెప్పింది. ఆ చిత్రంలో కాజోల్ పోషించిన సిమ్రన్ పాత్రంటే నాకు ఎంతో ఇష్టం. నటిగా నాపై కాజోల్ ప్రభావం చాలా ఉంది అంటూ చెప్పుకొచ్చింది ఇలియానా. అలాగే ఆ చిత్రంలో కాజోల్ ఎక్కడా నటించినట్లు కనిపించరు. బిహేవ్ చేశారు. ఒక్క కాజోలే కాదు.. ఆ సినిమాలో చేసిన వారందరూ పాత్రల్లో జీవించారు. కాబట్టే ఆ సినిమా ఓ క్లాసిక్‌లా నిలిచిపోయింది. సినిమాలపై నాకు ఆసక్తిని పెంచింది ఆ సినిమానే. నాటి నుంచి నేటి వరకూ కాజోల్ నాకు ఫేవరెట్ హీరోయిన్ అని చెప్పింది. ప్రస్తుతం ఇలియానా..ఎన్టీఆర్ సరసన శక్తి చిత్రంలోనూ, రానా సరసన నేను నా రాక్షసి చిత్రంలోనూ చేస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu