»   » ఛాన్స్ కోసం ఆ డైరక్టర్ తో గడపలేదు..ఇలియానా

ఛాన్స్ కోసం ఆ డైరక్టర్ తో గడపలేదు..ఇలియానా

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇలియానా ఓ డైరక్టర్ తో ఛాన్స్ కోసం రహస్యంగా ఓ రాత్రంతా హోటల్ లో గడిపిందనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆమె దగ్గర మీడియావారు ప్రస్ధావిస్తే..అవును..ఆ దర్శకుడుతో రాత్రంతా హోటల్ లో ఉన్నామన్నది నిజం. కానీ ఎందుకోసం ఉండాల్సి వచ్చిందనేది మీరు తెలుసుకోవాలి. ఆ డైరక్టర్ కథ చెప్తూంటే టైమే తెలియలేదు. రాత్రి బాగా లేటయిపోయింది. ఇక ఆ రాత్రి ఇంటికి వెళ్ళటం ఇబ్బందిఅవుతుందనే ఉద్దేశ్యంతో ఆ హోటల్ లో అతనితోనే ఉన్నా. ఆ రాత్రంతా ఏవోవో సినిమా కబుర్లు చెప్పుకుంటూ గడిపాం..అంతకు మించి మీరు ఎక్కువ ఊహించవద్దు అని సమాధానమిచ్చింది.

ఇక పూరీ జగన్నాధ్ నాకు మళ్ళీ ఛాన్స్ ఇవ్వటానికి పెద్ద కారణం లేదు..పోకిరి చేసే సమయంలో మళ్ళా నాతో సినిమా చేస్తానని మాటిచ్చారు. నిలబెట్టుకున్నారు..అలాగే నేనిమిటో ఆయనకు పూర్తి తెలుసు కాబట్టే ఈ అవకాశం వచ్చింది. రానా తో నా కెమిస్ట్రీ బాగా పండుతోంది అని చెప్పింది. ఇక ఎవరినైనా ప్రేమించారా అంటే...ప్రస్తుతానికి అది టాప్ సీక్రెట్. సమయం వచ్చినప్పుడు చెప్తాను అంది.ఇక ప్రస్తుతం ఇలియానా...పూరీ జగన్నాధ్ దర్సకత్వంలో నేనూ..నా రాక్షసి అనే చిత్రం చేస్తోంది. మోడ్రన్ టచ్ ఉన్న విభిన్నమైన ప్రేమ కథగా ఆ చిత్రాన్ని చెప్తున్నారు. రానా ..లీడర్ తర్వాత చేస్తున్న ఈ చిత్రం తమిళ,హిందీ బాషల కోసం కూడా టార్గెట్ చేస్తున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu