»   »  ఇలియానా వింత కోరిక

ఇలియానా వింత కోరిక

Posted By:
Subscribe to Filmibeat Telugu
Illeana
నేటివిటీ తో సాగే పాత్రలంటే తనకు ఇష్టమని..తెలుగు సాంప్రదాయమైన లంగా, ఓణీల్లో తిరిగే పల్లెటూరు అమ్మాయిగా కనపడాలని ఉందని ఇలియనా చెప్తోంది. అంటే నువ్వు వస్తానంటే నే వద్దంటానా సినిమాలో త్రిషా తరహా పాత్రను ఎక్స్ పెక్ట్ చేస్తోందన్నమాట. ఆమెతో అందరూ ఫారిన్ లో పాటలు తీస్తాం, కత్తిలాంటి కథ అని ఊరిస్తారే తప్ప తనకిష్టమైన పాత్ర ఇవ్వటం లేదట. ఎప్పుడూ జీన్స్,మిడ్డిలు ధరించాల్సి వస్తోందట. అందరూ తనని ఎక్స్ ఫోజ్ చేయటానికి చూస్తారే కాని తనలోని నటనను బయిటకు తెచ్చే ప్రయత్నం చేయటం లేదట. ఎంతసేపూ దర్శక నిర్మాతలు మోడరన్ అవుట్ ఫిట్స్ వేసుకోమంటారంటూ విసుక్కుంటోంది. అసలే ఆమె చేసిన సినిమాలు అంతంత మాత్రంగా ఆడుతున్న ఈ సమయంలో ఇలాంటి కోర్కెల లిస్టులు చదివితే త్వరలోనే మాజీల లిస్టులోకి చేరాల్సి ఉంటుందంటున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X