»   » పిచ్చ క్రేజ్: 'బాహుబలి' టికెట్ల కోసం ఫ్యాన్స్ ఇలా... (వీడియో)

పిచ్చ క్రేజ్: 'బాహుబలి' టికెట్ల కోసం ఫ్యాన్స్ ఇలా... (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న 'బాహుబలి' విడుదలకు సిద్దమైన సంగతి తెలిసిందే. ఈనెల 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండటంతో తెలుగురాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకుంగ్ సందడి మొదలైంది. హైదరాబాద్ ప్రసాద్ ఐమాక్స్ వద్ద సందడి ఏం రేజిలో ఉందో ఈ క్రింద వీడియో చూడండి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడుఅలాగే...విడుదలకు ముందే నగరంలోని అన్ని థియేటర్లలో టికెట్లు అమ్ముడుపోగా... రెండు రోజుల ముందుగానే ప్రసాద్‌ ఐమాక్స్‌ వద్ద టికెట్ల కోసం అభిమానులు బారులు తీరారు. ఇదిగో ఆ ఫీవర్ ఏ రేంజిలో ఉందో పరిశీలించండి.
బాహుబలిని తొలిరోజు తొలి ఆట చూసేందుకు ఫ్యాన్స్ ఉత్సాహం చూపుతున్నారు. సినీ ప్రియులు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. టికెట్ల కోసం వారం రోజుల ముందు నుంచే వెతుకులాట మొదలు పెట్టిన అభిమానులు... వాటికోసం శతవిధాల ప్రయత్నిస్తున్నారు.


IMAX advance booking Hungama Baahubali

ఇక బాహుబలి ...పైరసీ గురించి చూస్తే..


పైరసీకి వ్యతిరేకంగా కొంతమంది తెలుగు సినీ నిర్మాతలు సంఘటితమై హైదరాబాద్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ''తెలుగువాళ్లంతా గర్వంగా చెప్పుకొనే చిత్రం 'బాహుబలి'. మూడేళ్లు కష్టపడి 'బాహుబలి'ని తెరకెక్కించారు. దాన్ని వెండితెరపై చూసి ఆస్వాదించండి. పైరసీ చూడొద్దు'' అని నిర్మాతలు అభ్యర్థించారు.


IMAX advance booking Hungama Baahubali

ఈ సందర్భంగా అరవింద్‌ మాట్లాడుతూ ''జులై 10న 'బాహుబలి' వస్తోంది. ఆ రోజు యావత్‌ చిత్ర పరిశ్రమ మన వైపు చూస్తుంది. కనుల పండగలాంటి చిత్రాన్ని పైరసీలో చూస్తే సంతృప్తి దొరకదు. పైరసీని అరికట్టడానికి తెలుగు చిత్రసీమ ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తోంది. న్యాయస్థానం కూడా 'జాండో ఆర్డరు' జారీ చేసింది. ఏం చేసినా ఆన్‌లైన్‌లో జరిగే పైరసీని ఆపడం కష్టమైపోతోంది. అందుకోసం సర్వీస్‌ ప్రొవైడర్ల సహకారం తీసుకొంటున్నాం.


ఏయే వెబ్‌సైట్లు పైరసీకి పాల్పడుతున్నాయో గుర్తించాం. థియేటర్లలో జరిగే పైరసీని అడ్డుకోవడానికి మావంతు సన్నాహాలు చేస్తున్నాం. ఇక మీదట ఏ థియేటర్లో పైరసీ జరిగినా ఆ సమాచారం క్షణాల్లో తెలిసిపోయే ఏర్పాట్లు చేశాం. పైరసీ జరిగినట్టు రుజువైతే ఆ థియేటర్లపై ఏడాది పాటు నిషేధం విధిస్తాం. ఈ విషయంలో బెంగళూరు పోలీసులు కూడా మాకు పూర్తిగా సహకరించారు.


అక్కడ పైరసీ ముఠా ఒకటి నడుస్తోంది. ఇప్పటికే తొమ్మిది మంది పైరసీ నిందితులను అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ పోలీసులు కూడా చిత్రసీమకు సహకారం అందిస్తున్నారు. వాళ్లందరికీ మా ధన్యవాదాలు'' అన్నారు.


IMAX advance booking Hungama Baahubali

రాజమౌళి మాట్లాడుతూ ''పైరసీని అడ్డుకోవడానికి ఇది వరకు చాలా సార్లు ప్రయత్నించాం. కొన్ని సార్లు మాత్రమే విజయవంతమయ్యాం. థియేటర్లు డిజిటలైజ్డ్‌ చేయడం వల్ల పైరసీ ఎక్కడ జరిగింది? ఏ సమయంలో జరిగింది? అనే విషయాలు ఆధారాలతో సహా తెలిసిపోతున్నాయి. అలాంటి థియేటర్లను సీజ్‌ చేయడానికి చలనచిత్ర వాణిజ్య మండలి చర్యలు తీసుకొంటుంది.


అందరూ సినిమాపై బతుకుతున్నవాళ్లమే. కాబట్టి పరిస్థితి చేయిదాటకుండా థియేటర్ల యాజమాన్యమే జాగ్రత్తలు తీసుకోవాలి. 'బాహుబలి' అనేది పెద్ద సినిమా. దాన్ని పెద్ద తెరపైనే చూడండి. పైరసీ జోలికి వెళ్దొద్దు'' అన్నారు.


''సినిమా అనేది ఓ కళ. కళని దొంగతనం చేయొద్దు. పైరసీ చేయడం అంటే పక్కవాడి సెల్‌ఫోన్‌ లాక్కోవడమే..'' అని రానా చెప్పారు.

English summary
Watch Bahubali Fever at Prasad Imax.Bahubali Releasing on July 10th 2015.Starring Prabhas, Rana Daggubati, Sudeep, Anushka Shetty, Tamannaah, Sathyaraj, Ramya Krishnan among Others.Directed By S. S. Rajamouli and Produced by K. Raghavendra Rao,Shobu Yarlagadda and Prasad Devineni.Music Composed by M. M. Keeravani.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu