»   » ‘అజహర్’ టీజర్: మ్యాచ్ ఫిక్సింగ్ మాట ఎత్తాడు (వీడియో)

‘అజహర్’ టీజర్: మ్యాచ్ ఫిక్సింగ్ మాట ఎత్తాడు (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: నేను మూడు కారణాలు వలన బాగా ఫేమసయ్యాను. దేముడ్ని నమ్మడం, పెళ్లి, మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ అజర్ డైలాగు చెప్పారు. అవే ఇప్పుడు క్రికెట్ వీరాభిమానులను, సినీ అబిమానులను తన వైపు తిప్పుకునే ఆలోచనలో పడేలా చేసాయి. భారత క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ జీవిత కథ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ వివాదాస్పద హైదరాబాదీ క్రికెటర్ పాత్రను పోషిస్తున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

అజహరుద్దీన్ జీవితచరిత్ర ఆధారంగా ఏక్తాకపూర్ నిర్మిస్తున్న ‘అజహర్' సినిమా ఫస్ట్‌లుక్‌ను నాలుగురోజుల క్రితం విడుదల చేయగా ఇప్పుడు టీజర్‌ను విడుదల చేశారు. టోనీ డిసౌజా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఈ టీజర్ అద్భుతంగా ఉందంటూ ప్రశంసలు వస్తున్నారు. మీరూ ఓ లుక్కేయండి ఆ టీజర్ పై...

పెవినిలియన్ ఎండ్‌నుండి స్టేడియంలోకి బ్యాట్ చేతపట్టుకుని అజహర్ పాత్రధారి ఇమ్రాన్‌హష్మి నడచివస్తున్న దృశ్యం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆయన వస్తున్న దారికి ఓవైపు అతడి దిష్టిబొమ్మను తగులబెడుతున్న దృశ్యం, మరోవైపు ఆయనను అభినందిస్తున్న అభిమానులు కన్పిస్తారు. ముమ్మాటికీ అజహర్ మాదిరిగానే నడచివచ్చిన హష్మి ఈ చిత్రంలో సంచలనమే సృష్టించనున్నాడని దీనితో అంచనావేస్తున్నారు.

ఈ దృశ్యం కన్పిస్తున్నప్పుడు ఓ డైలాగ్ విన్పిస్తుంది. ప్రపంచ రికార్డుతో కెరియర్ ప్రారంభించి, మ్యాచ్‌ఫిక్సింగ్ వివాదంలో ఇరుక్కున్న మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ ఈ టీజర్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. తన క్రికెట్, వివాహం, మ్యాచ్‌ఫిక్సింగ్ వివాదంపై ఈ సినిమా వాస్తవాలను చూపిస్తుందని ఆయన అన్నారు. కాగా ఈ సినిమాను వచ్చేఏడాది మేలో విడుదల చేయాలని భావిస్తున్నారు.

ప్రముఖ దర్శకుడు... అజార్ కు అత్యంత ఆప్తుడిగా పేరున్న ఆంటోనీ డిసౌజా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. క్రికెటర్ జీవితాన్ని దగ్గర నుంచి పరిశీలించిన ఆంటోనీ సినిమాను వాస్తవానికి దగ్గరగా తీర్చిదిద్దగలడన్న నమ్మకంతో దర్శకత్వం బాధ్యతలను అప్పగించారట.... ఈ బయోపిక్ ను కేవలం డ్రామాగా తీర్చిదిద్దబోవడంలేదని తెలిపిన చిత్ర బృందం... సినిమాకు అన్ని కమర్షియల్ హంగులూ అద్దబోతున్నట్లు వెల్లడించింది... ఇందులో భాగంగానే టైటిల్ రోల్ కు సీరియల్ కిస్సర్ గా పేరుగాంచిన ఇమ్రాన్ హష్మీని ఫైనలైజ్ చేశారట... ఇటీవల విడుదలైన సినిమా ఫస్ట్ లుక్ అటు అటు సినీ ప్రియులను, క్రికెట్ ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

Imran Hasmi's AZHAR - Official Teaser

జారుద్దీన్ జీవితగాథ తెరకెక్కబోతోందన్న వార్త ఎప్పటినుంచో ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్నప్పటికీ... ఇన్నాళ్లకు సరైన ముహూర్తం కుదిరింది. ఈ హైదరాబాదీ క్రికెటర్ జీవితంలోని ట్విస్ట్ లు, టర్నింగ్ పాయింట్ లు ఓ కమర్షియన్ మసాలా సినిమాకు కావాల్సిన కథావస్తువుగా సరిగ్గా సరిపోతుందని భావించిన బాలీవుడ్ నిర్మాతలు... ఎట్టకేలకు బయోపిక్ ను సెట్స్ మీదకు తీసుకువెళ్లడంతో సఫలమయ్యారు.

అజార్ క్రికెట్ టీమ్ కెప్టెన్ గా సాగించిన విజయ పరంపర దగ్గర నుంచి మ్యాచ్ ఫిక్సింగ్ స్కాండల్ లో అతని ప్రతిష్ఠ మసకబారడం, ముంబై మోడల్ సంగీతా బిజలానీతో అతడి అఫైర్, ఆపై వివాదాల నడుమ జరిగిన వారి వివాహం, అతడి రాజకీయ పయనం వరకూ అన్నీ అంశాలనూ కూలంకషంగా తెరకెక్కిస్తారట.... అజార్ సైతం ఈ సినిమాకు తగిన సహకారం అందిస్తున్నాడని చిత్ర బృందం వెల్లడించింది. మరి అజార్ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయబోతున్న ఇమ్రాన్ హష్మి... ప్రేక్షకులను ఏ రీతిన మెప్పిస్తాడో చూడాలి.

English summary
‘Azhar’ – was officially launched in a star-studded ceremony, Azhar had said, “The movie is about my God, my marriage and match-fixing.” True to the statement, the official teaser, which came out today (May 25), depicts only these aspects. Emraan Hashmi, who portrays the cricketer in the movie
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu