»   » 2010లో మహేష్ డబుల్ ధమాకా?

2010లో మహేష్ డబుల్ ధమాకా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఈ 2010కి మహేష్ బాబు గ్యారింటీగా డబుల్ ధమాకా ఇచ్చే అవకాశం ఉందని, ఆ దిశగా మహేష్ అడుగులు వేస్తున్నారని తెలుస్తోంది. నిజానికి అతిధి అనంతరం రెండేళ్ళ గ్యాప్ లో మహేష్ ది ఇప్పటి వరకూ సినిమా ఏదీ రాలేదు. అప్పుడప్పుడూ టీవీల్లో యాడ్స్ ద్వారా పలకరించటం తప్ప అభిమానులకు ఆనందం కలిగించేలా కదలిక లేదు. అయితే ఇప్పుడు మహేష్ బాబు ఇలా గ్యాప్ రాకూడదని అనుకుంటున్నారు. మహేష్, తివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో అనుష్క హీరోయిన్ గా రూపొందుతున్న ఖిలాడి చిత్రాన్ని వేసవి కానుకగా ప్రేక్షకుకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరో ప్రక్క మహేష్‌బాబు హీరోగా మార్చిలో శ్రీనువైట్ల దర్శకత్వంలో 14రీల్స్ ఎంటర్‌టైన్‌ మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌ లో సాగే సున్నితమైన ప్రేమకథా చిత్రంగా దీనిని శ్రీను వైట్ల రూపొందించనున్నాడు. నార్త్ ఇండియా బ్యాక్ డ్రాప్ లో కథ నడుస్తుంది. అలాగే మహేష్‌బాబును సరికొత్త స్టైల్లో కనిపించే చిత్రమిదని దర్శకుడు చెబుతున్నారు. అలాగే మహేష్‌బాబు చిత్రాల్లో కామిడీ ఉన్నా ఇప్పటి వరకు పూర్తి స్థాయి కామెడీని ఏ చిత్రంలోనూ చేయలేదు. కానీ ఈ చిత్రంలో అటు యాక్షన్, ఇటు కామెడీని సమపాళ్లలో పండించే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. ఇక శ్రీనువైట్ల 'ఆనందం" తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు పూర్తి ప్రేమకథా చిత్రంగా దీన్ని రూపొందించనున్నానని చెబుతున్నాడు. శ్రీనువైట్ల కెరీర్‌లో తొలిసారి సూపర్-35 ఎం.ఎం.కెమెరాను ఈ చిత్రానికి వినియోగించబోతున్నాడు. ఈ చిత్రాన్ని కూడా ఈ ఏడాది చివర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాబట్టి మహేష్ అభిమానులకు ఈ ఏడు డబుల్ ధమాకా లభించినట్లే నని ఫిల్మ్ వర్గాలు అంటున్నాయి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu