»   » ‘రక్త చరిత్ర’ కోసం మారు వేషాల్లో ఇంటిలిజెంట్స్ వర్గాల నిఘా....

‘రక్త చరిత్ర’ కోసం మారు వేషాల్లో ఇంటిలిజెంట్స్ వర్గాల నిఘా....

Posted By:
Subscribe to Filmibeat Telugu

అనంతపురంలో 'రక్త చరిత్ర" సినిమాని ప్రేక్షకుల మధ్య కూర్చుని చూస్తానన్న సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, సినిమా విడుదలకు ఒకరోజు ముందే తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. స్థానిక పోలీసు యంత్రాంగం చేసిన సూచనల మేరకో..లేక తనంతట తానుగా ఈ నిర్ణయం తీసుకున్నాడాగానీ, 'రక్త చరిత్ర" సినిమాని అనంతపురంలోనే చూడాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం పట్ల పోలీసు అధికారులు కాస్తంత హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా, వర్మ గనుక అనంతపురంలో సినిమా చూడ్డానికి వస్తే ముందస్తుగా అరెస్టు చేయాలని బీజేపి, అనంతపురం జిల్లా డీఐజీకి విజ్ఝప్తి చేయడంతోనే వర్మ, వెనక్కి తగ్గడనే వార్తలూ విన్సిస్తున్నాయి.

మరోపక్క, హైదరాబాద్ లో 'రక్తచరిత్ర" సినిమా ప్రీమియర్ ని పరిటాల రవి, మద్దెలచెరువు సూరి వర్గీయులకోసం ప్రత్యేకంగా వర్మ ఏర్సాటు చేసినట్టు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా రేపు విడుదల కానున్న 'రక్త చరిత్ర" సినిమా కోసం, వర్మ అభిమానులే కాదు, ఫ్యాక్షన్ కథలపై ఇంట్రెస్ట్ చూపేవారూ, ఫ్యాక్షన్ రాజకీయాలతో సంబంధం ఉన్నవారూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కాగా అనంతపురం జిల్లాలో 'రక్త చరిత్ర" సినిమా పట్ల భారీ ఎత్తున ఉత్కంఠం నెలకొంది. ఒక్కడ పరిస్థితులు సజావుగా ఉండటం కోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్సాటు చేశారు. అది మాత్రమే కాకుండా ఇంటిలిజెంట్స్ వర్గాలు మారు వేషాల్లో సంచరిస్తున్నాయని సమాచారం. ఓబుల్ రెడ్డిగ్రూపు, మద్దెలచెరువు సూరి, పరిటాల రవి గ్రూపులపై ఓ కన్నేిస ఉంచారని తెలుస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu