»   » ‘మాయాబజార్’ విజయోత్సవ వేడుక!

‘మాయాబజార్’ విజయోత్సవ వేడుక!

Posted By:
Subscribe to Filmibeat Telugu

అలనాటి 'మాయాబజార్" చిత్రానికి రంగులు హంగులు దిద్ది గోల్డ్ స్టోన్ టెక్నాలజీ సంస్థ విడుదల చేయడం, ఆ చిత్రానికి తెలుగు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించడం తెలిసిందే. రంగుల 'మాయాబజార్" 50 రోజుల ప్రదర్శన పూర్తయిన సందర్బంగా ఈ చిత్ర అర్ధ శతదినోత్సవ కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అక్కినేని నాగేశ్వరరావు మాట్టాడుతూ మాయాబజార్ చిత్రాన్ని ప్రత్యేకించి ఇప్పుడు రంగులు చేయండం కాదు. ఈ చిత్రం ఎప్పుడూ కలర్ ఫుల్ చిత్రమే. ఈ చిత్రాన్ని రంగుల్లో చూసి నేను ఆశ్చర్య పోలేదు. ఎందుకంటే ఈ సినిమాలోని ఒరిజినల్ కలర్స్ ని నేను సెట్ లోనే చూశాను అని అన్నారు. ఇంత మంచి ప్రయత్నం చేసిన గోల్డ్ స్టోన్ టెక్నాలజీ సంస్థ వారిని ఈ సందర్బంగా అక్కినేని అభినందించారు. ఈ వేడుకలో భాగంగా గోల్డ్ స్టోన్ టెక్కాలజీ సంస్థ అక్కినేని నాగేశ్వరరావు గారిని ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా సుశాంత్ మాట్లాడుతూ ఈ సినిమాను కలర్ లో చూసి చాలా ఆశ్చర్యపోయా అన్నారు. తర్వాత లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ ఈ చిత్రాన్ని కలర్స్ లోనికి మార్చి ప్రేక్షకులను ఆనందపరచారన్నారు. తెలుగు సినిమా ఉన్నంత వరకు 'మాయాబజార్ గురుంచి చెప్పుకుంటారిని బీ ఏ రాజు చెప్పారు. చివరిగా సి జగన్మోహన్ మాట్లాడుతూ 'మా ప్రయత్నాన్ని సఫలం చేసి ఈ అపురూప చిత్రాన్ని అపూర్వం గా ఆదరించిన ప్రేక్షకులకు దన్యవాదాలు" అని తెలిపారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu