»   » రామ్ చరణ్ - భారత్ క్రికెట్ కెప్టెన్ ధోని ల స్పెషల్ బొనాంజా!

రామ్ చరణ్ - భారత్ క్రికెట్ కెప్టెన్ ధోని ల స్పెషల్ బొనాంజా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

భారత్ క్రికెట్ జట్టు కెప్టెన్ ధోని, మెగాస్టార్ చిరంజీవి తనయుడితో కలిసి..సినిమా చేస్తే ఎలా ఉంటుందో..ఒక్కసారి ఊహించుకోండి! అరే ఊహా కూడా చాలా బాగుంది..కదా! మరి అయితే వారిరువురు సినిమా మాత్రం తీయడం లేదు. కానీ త్వరలో ఇద్దరూ కలిసి మాత్రం కనిపించబోతున్నారు. పెప్సీ బ్రాండ్ అంబాసిడర్ అయిన ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ ధోని, రామ్ చరణ్ కలిసి ఇటీవలే ముంబాయిలో షూటింగ్ పూర్తి చేశారు. అది కూడా త్రివిక్రమ్ దర్శకత్వంలో, ఇంతకీ వారు షూటింగ్ చేసినది ఏమనుకుంటున్నారా!

అది ఒక వాణిజ్య ప్రకటన ఈ ప్రకటన వచ్చే ఐపీఎల్ మ్యాచ్ లకు ముందుగా ఓవరాల్ ఇండియాకి రిప్రెజెంట్ చేయనున్నాడని సమాచారం. రామ్ చరణ్ పెప్సీకి ఆంధ్రప్రదేశ్ ప్రచారకర్తగా అందుకు సంబందించిన ప్రకటనలో ధోని, చరణ్ కలిసి నటించిన వాణిజ్య ప్రకటనను త్రివిక్రమ్ డైరక్ట్ చేశారు..ఈ కొత్త యాడ్ ఐపిఎల్ సందర్భంగా టీవీల్లో ప్రత్యక్షం కానుంది. వీరిద్దరు కలిసి చేసినది వాణిజ్య ప్రకటనే అయినప్పటికీ యాడ్ ఎప్పుడు వస్తుందా! అని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఇటు క్రికెట్ అభిమానులతో పాటు అటు చరణ్ అభిమానులు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో థమ్సప్ కి మహేష్, సెవెన్ అప్ కి అల్లు అర్జున్ ప్రచారం నిర్వహిస్తున్న విషయం విధితమే.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu