twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    త్రీడీలో ప్రభుదేవా డాన్స్ లు

    By Srikanya
    |

    న్యూఢిల్లీ: డ్యాన్సింగ్ స్టార్ ప్రభుదేవా కొంత విరామం తర్వాత తన నృత్యాలతో ప్రేక్షకులను అలరించబోతున్న చిత్రం 'ఎనీబడి కెన్ డాన్స్' (ఎబిసిడి). ఇటీవల బాలీవుడ్‌లో దర్శకుడిగా బిజీ అయిన తర్వాత ప్రభుదేవా తెరవెనుకకే పరిమితం అయ్యారు. అయితే తాజాగా మరోసారి తన అభిమానులను తన స్టెప్స్ తో అలరించేందుకు ముందుకు వస్తున్నారు.

    రెమో డిసౌజా దర్శకత్వంలో రూపొందిన ఈ హిందీ చిత్రాన్ని తెలుగులో శివప్రసాద్, పి.కిశోర్ తెలుగులో విడుదల చేస్తున్నారు. లవ్, యాక్షన్, కామెడీ ప్రధానంగా సాగే మంచి మ్యూజికల్ మూవీ అని, ప్రభుదేవా హై ఓల్టేజ్ డాన్సులు ప్రేక్షకులు ఎంజాయ్ చేసే విధంగా ఉంటాయని నిర్మాతలు తెలిపారు. భారతీయ తెరపై రూపొందిన తొలి డాన్స్ 3డి మూవీ ఇది. ఈ శనివారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

    బాలీవుడ్‌లో డ్యాన్స్ చిత్రాలకు మళ్లీ మంచిరోజులు వస్తాయని దర్శకుడిగా మారిన నృత్యదర్శకుడు రెమో డిసౌజా అభిప్రాయపడ్డారు. రెమో దర్శకత్వం వహించిన ఏబీసీడీ (ఎనీ బడీ కెన్ డ్యాన్స్) చిత్రం ఈ వారం విడుదల కానున్న సందర్భంగా చిత్ర విశేషాలను మీడియాకు వెల్లడించాడు. ఏబీసీడీ చిత్రం ట్రెండ్ మారుస్తుందని, నృత్య ప్రాధాన్యం ఉన్న చిత్రాలకు మళ్లీ మంచిరోజులు తీసుకొస్తుందన్నాడు. నవ్‌రంగ్, ఝనక్ ఝనక్ పాయల్ బాజే, జల్ బిన్ మచిలీ నృత్య బిన్ బిజిలీ వంటి చిత్రాలు మళ్లీ రావాలన్నాడు. ఒకప్పుడు ఈ చిత్రాలు సంచలన రికార్డులు నమోదు చేశాయని, అయితే ఆ తర్వాత నృత్య ప్రాధాన్యంగల చిత్రాల గురించి ఎవరూ పట్టించుకోలేదన్నాడు. అటువంటి ట్రెండ్ మళ్లీ రావాలని తాను కోరుకుంటున్నానని చెప్పాడు. నృత్య దర్శకుడిగా తనకంటూ ఓ పేరు సంపాదించుకున్న రెమో నృత్య ప్రాధాన్యమున్న చిత్రానికి దర్శకత్వం వహించాలనేది తన చిరకాల స్వప్నమన్నాడు.

    తొలి చిత్రంతోనే తన కలను నెరవేర్చుకోవాలనుకున్నా కుదరలేదని, తన తొలి చిత్రం 'ఫాల్తూ' విద్యావ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపేదిగా ప్రేక్షకుల ముందుకొచ్చిందన్నాడు. అయితే రెండో చిత్రంతోనైనా తన కల సాకారమైనందుకు సంతోషంగా ఉందన్నాడు. సినిమాకు దర్శకత్వం వహించే ముందే నిర్మాతల ముందు.. ప్రభుదేవా ప్రధాన పాత్ర పోషించాలని, చిత్రం త్రీడీలో తెరకెక్కాలని, డ్యాన్స్ ఇండియా డ్యాన్స్‌లోని పోటీదారులు చిత్రంలో ఉండాలని షరతులు పెట్టానన్నాడు. అందుకు నిర్మాతలు కూడా సహకరించడంతో సినిమా బాగా కుదిరిందని చెప్పాడు. అయితే ప్రేక్షకుల స్పందన ఎలా ఉండబోతుందో తెలుసుకునేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పాడు.

    English summary
    Dance films in Bollywood have been few and far between, but the drought is going to end with choreographer-turned-director Remo D’Souza’s ABCD - Any Body Can Dance, touted as India’s first 3D dance film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X