»   » బాలయ్యపై ‘ఇండియా టుడే’ స్పెషల్ ఎడిషన్

బాలయ్యపై ‘ఇండియా టుడే’ స్పెషల్ ఎడిషన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ జాతీయ పత్రిక 'ఇండియా టుడే' గతంలో చిరంజీవి, నాగార్జున, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు తదితరులపై ఇప్పటికే స్పెషల్ ఎడిషన్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. త్వరలో నందమూరి బాలకృష్ణపై కూడా ఇండియా టుడే వారు ప్రత్యేక సంచిక విడుదల చేయబోతున్నారు.

జనవరి చివరి వారంలో ఈ సంచిక వెలువడుతుంది. ఇందులో బాలకృష్ణ వ్యక్తిగత, సినీ, రాజకీయ జీవితాలకు సంబంధించిన పలు విశేషాలను పొందుపరుస్తున్నారట. అలాగే, తన వందవ చిత్రం గురించి, తన వారసుడిగా త్వరలో సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న మోక్షజ్ఞ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారట. అభిమానులు ఈ సంచిక కోసం ఎదురు చూస్తున్నారు.


ప్రస్తుతం బాలయ్య తన 99వ సినిమా ‘డిక్టేటర్' ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. బాలకృష్ణ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో ఈరోస్ ఇంటర్నేషనల్, వేదాశ్వ క్రియేషన్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాయి. అంజలి, సోనాల్ చౌహాన్, అక్ష హీరోయిన్స్ గా నటించారు. బాలకృష్ణ కెరీర్ లో అత్యధిక థియేటర్స్ లో వరల్డ్ వైడ్ గా ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా జ‌న‌వ‌రి 14న గ్రాండ్ లెవల్లో విడుద‌ల చేస్తున్నారు.


India Today's special edition on Balakrishna

సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ‘యు/ఎ' సర్టిఫికేట్ ను పొందింది. సినిమా చూసిన సెన్సార్ సభ్యులు సినిమా చాలా బావుందని ప్రశంసించారు. నందమూరి బాలకృష్ణ డైలాగ్స్, యాక్షన్ సన్నివేశాలు బావున్నాయని, ఇలా అన్నీ ఎలిమెంట్స్ ఉన్న ఎంటర్ టైనర్ రూపొందడంలో ముఖ్య పాత్ర పోషించిన నందమూరి బాలకృష్ణ సహా చిత్రయూనిట్ సెన్సార్ సభ్యులు అభినందించారు.


ఇప్పటికే ఎస్.ఎస్.థమన్ థ‌మ‌న్ సంగీతం అందించిన పాటలకు, థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌కు సూప‌ర్ రెస్పాన్స్ వ‌చ్చింది. అలాగే న్యూ ఇయ‌ర్ కానుక‌గా విడుద‌ల చేసిన‌ యాక్ష‌న్ ట్రైల‌ర్‌కు ప్రేక్షాభిమానుల నుండి మంచి స్పంద‌న వ‌చ్చింది. నంద‌మూరి అభిమానులు బాల‌కృష్ణ‌ను ఎలా చూడాల‌నుకుంటున్నారో ఆ రేంజ్‌లో స్ట‌యిలిష్‌గా, ప‌వ‌ర్‌ఫుల్‌గా బాల‌కృష్ణ పాత్ర ఆద్యంతం ఆక‌ట్టుకునేలా ఉంటుందని కో ప్రొడ్యూస‌ర్‌, ద‌ర్శ‌కుడు శ్రీవాస్ తెలియ‌జేశారు.


ఆనంద్ రామరాజు, సుమన్‌, పవిత్రాలోకేష్‌, నాజర్‌, వెన్నెల కిషోర్‌, పృథ్వీ, కాశీ విశ్వనాథ్‌, పోసాని కృష్ణమురళి, ప్రభాస్‌ శ్రీను, హేమ, కబీర్‌, విక్రమ్‌ జీత్‌,అజయ్‌ తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి ఫైట్స్‌: రవివర్మ, ఆర్ట్‌: బ్రహ్మకడలి, ఎడిటర్‌: గౌతంరాజు, మ్యూజిక్‌: ఎస్‌.ఎస్‌.థమన్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ ఫోటోగ్రఫీ: శ్యామ్‌ కె.నాయుడు, రచన: శ్రీధర్‌ సీపాన, మాటు: ఎం.రత్నం, కథ, స్క్రీన్‌ప్లే: కోనవెంకట్‌,గోపిమోహన్‌, నిర్మాత: ఈరోస్‌ ఇంరట్నేషనల్‌, కో ప్రొడ్యూసర్‌, దర్శకత్వం: శ్రీవాస్‌.

English summary
India today in a move that delight all Nandamuri fans is coming with a special edition on Natasimha Balakrishna who is getting ready to give spectacular sankranthi treat with his Dictator on Jan 14 on Tollywood silver screen.
Please Wait while comments are loading...