»   » ‘ఇండియా టుడే’ కవర్ పై బాలయ్య... స్పెషల్ ఎడిషన్ ఈ రోజే

‘ఇండియా టుడే’ కవర్ పై బాలయ్య... స్పెషల్ ఎడిషన్ ఈ రోజే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలకృష్ణ... ఈ పేరు వినగానే అందరికీ ఫ్యాక్షన్, యాక్షన్ ఈ రెండు గుర్తుకు వస్తాయి. ఈ నందమూరి అందగాడు ఎన్నో అందమైన పాత్రలతో ప్రేక్షకులని ఆకటుకుని, చాలా మందిని అభిమానులను సంపాదించుకున్నారు.

అంతేనా...కుర్రహీరోలతో సైతం పోటీపడుతూ తన సత్తాను ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూనే వున్నారు. అయితే ఈ హిందుపురం ఎమ్.ఎల్.ఎ ..తన చిలిపి సంబాషణలతోనే ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో కనిపిస్తున్నారు.

తనకు పదవి ఇస్తానన్నా వద్దని గౌరవంగా, తనకు సినిమా లేకపోతే తాను లేనని ఘనంగా చాటుకున్న వ్యక్తి. అలా అని తన నియోజకవర్గాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూనే, వారికి అందే పధకాలు సక్రమంగా అందుతున్నాయో లేవో కూడా దగ్గరుండి మరీ చుసుకుంటూ, తన కత్తికి రెండు వైపులా పదునుందని నిరూపించుకుంటూ ముందుకు సాగిపోతున్నారు.

India Today special edition on Balakrishna

ఇప్పుడు మరో గౌరవం దక్కనుంది బాలకృష్ణకి. ఇండియా టూడే కవర్ ఫోటోగా లెజెండరీ ఫోస్టర్ వచ్చి చేరింది. దీనిని ఏ.పి. సిఎమ్. ఎన్. చంద్రబాబు నాయుడు 3 గంటలకు సచివాలయంలో విడుదల చేయనున్నారు. దీనికి సంబందించిన పోస్టర్ మీరు ను ఇక్కడ మీరు చూడవచ్చు.

ఈ రోజు విడుదల చేయనున్న స్పెషల్ ఎడిషన్ తాలూకు ఫ్రంట్ పేజ్ పై బాలయ్య లెజెండ్ సినిమాలోని లుక్ ను ముద్రించి 'ది లెజెండ్' అన్న టైటిల్ కూడా పెట్టారు. అంతేగాక దీనిపై ' తన తరం హీరోల్లో ఏకైక ఆల్ రౌండర్.. తండ్రికి తగ్గ తనయుడిగా సినీ, రాజకీయ, సేవా రంగాల్లో చరిత్ర సృష్టిస్తున్న అనితరసాధ్యుడు' అన్న క్యాప్షన్లు కూడా ఉన్నాయి.

ఈ పుస్తకంలో బాలకృష్ణ సినీ, రాజకీయ జీవిత విశేషాలను ప్రస్తావిస్తారని తెలుస్తోంది. తమ హీరో ఇంత అరుదైన గౌరవం దక్కించుకోవడంతో నందమూరి అభిమానులు ఆనందోత్సాహాలతో పండుగ చేసుకుంటున్నారు.

English summary
Indiatoday Special on Yuvaratna Nandamuri Balakrishna Ap cm will launch at secretariat 3pm tomorrow
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu